Vijay Thalapathy: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. శత్రువు ఎవరంటే
ABN , Publish Date - Oct 27 , 2024 | 09:26 PM
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ భవిష్యత్తు మరో రెండేళ్లలో తెలియనుంది. 2026లో తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే విజయ్‌కి సరిపడా పొలిటికల్ ఎనిమి ఎవరంటే..
తమిళనాడు రాజకీయాల్లోకి హీరో విజయ్ ఎంట్రీతో హీట్ పెరిగిపోయింది. అయితే తమిళనాడులో రాజకీయాలపై సినిమా ప్రభావం ఎంతో ఉంది. గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత సినిమా తారలే. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కూడా రాజకీయ ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేదు. స్టార్ హీరో విశాల్ కూడా భవిష్యత్ లో పొలిటికల్ పార్టీ స్థాపించే ఉద్దేశం ఉన్నట్లు గతంలో తెలిపాడు. ఇక శివాజీ గణేషన్, విజయ్ కాంత్, శరత్ కుమార్ కూడా క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ భవిష్యత్తు మరో రెండేళ్లలో తెలియనుంది. 2026లో తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే విజయ్ కి సరిపడా పొలిటికల్ ఎనిమి ఎవరంటే..
చాలా మంది అనుకున్నట్లే.. డీఎంకె అధినేత స్టాలిన్ తనయుడు ఉదయానిధి స్టాలిన్. ఉదయానిధి స్టాలిన్.. తమిళనాడు రాజకీయాల్లో యూత్ ఐకాన్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలే డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టి తమిళ్ పాలిటిక్స్‌లో కొత్త ధోరణి సృష్టిస్తున్నారు. తాజాగా జరిగిన మీటింగ్‌లో విజయ్ మాట్లాడుతూ.. సిద్ధాంత పరంగా బీజేపీ, డీఎంకెకి వ్యతిరేఖం అని తెలపడంతో తమిళనాడు రాజకీయాల్లో తరువాతి తరం పాలిటిక్స్ మొదలైనట్లు తెలుస్తుంది.
మూడు దశాబ్దాల ప్రయాణంలో దళపతి విజయ్ సినీ రంగంలో తిరుగులేని స్టార్‌డమ్‌తో స్టార్ హీరోగా రాణించారు. ఆయన హీరోగా రానున్న దళపతి 69 చిత్రం.. 2025 అక్టోబర్ నెలలో థియేటర్స్‌లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానుంది. ‘తుణివు’, వలిమై’ చిత్రాల దర్శకుడు హెచ్ వినోద్ Thalapathy69 కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా.. జగదీష్ పళనిస్వామి, లోహిత్ సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఎన్. కే. వెంకట్ కే నారాయణ ఆధ్వర్యంలో ఈ మూవీ నిర్మితం కానుంది.