Vikram: అపరిచితుడు రీమేక్‌.. నన్ను ఎందుకు తీసుకోలేదో..

ABN , Publish Date - Sep 09 , 2024 | 10:17 AM

చియాన్‌ విక్రమ్‌(Vikram), శంకర్‌ (Shankar)కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు’ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. 2005లో విడుదలైన ఈ సినిమా రీమేక్‌పై తాజాగా విక్రమ్‌ మాట్లాడారు.

చియాన్‌ విక్రమ్‌(Vikram), శంకర్‌ (Shankar)కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు’ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. 2005లో విడుదలైన ఈ సినిమా రీమేక్‌పై తాజాగా విక్రమ్‌ మాట్లాడారు. దీని హిందీ వెర్షన్‌ రీమేక్‌లో రణ్‌వీర్‌సింగ్‌ నటించడంపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ‘తంగలాన్‌’ (Thangalaan) చిత్రం హిందీలో విడుదల సందర్భంగా ప్రస్తుతం ఆయన ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ‘‘అపరిచితుడు రీమేక్‌ (Aparichithudu Remake) గురించి శంకర్‌కు మాత్రమే తెలుసు. రీమేక్‌ నాతో ఎందుకు తీయడం లేదని ఆయన్నే అడగండి. ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన చిత్రం. రణ్‌వీర్‌సింగ్‌ ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్‌ చేస్తాడని నాకు నమ్మకముంది. ఇండస్ట్రీలో  నాకు ఇష్టమైన నటుల్లో రణ్‌వీర్‌ ఒకరు. ఆయన్ని అపరిచితుడు పాత్రలో చూడటం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. వీలైనంత త్వరగా ఈ సినిమా రీమేక్‌ చూడాలనుంది’’ అని అన్నారు.

మనుషుల్లోని నిర్లక్ష్యం, స్వార్థం, అవినీతి... వంటి వాటిపై సూటిగా ప్రశ్నించిన సినిమా. అప్పట్లో ప్రజల్లో చైతన్యం కల్గించి, ఆలోచింపచేసిన సినిమా ఇది. 2021లోనే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలని ప్రయత్నాలు చేశారు. రణ్‌వీర్‌ హీరోగా ఇది రానున్నట్లు శంకర్‌ అప్పట్లో శంకర్‌ ప్రకటించారు. పెన్‌ స్టూడియోస్‌ సంస్థలో జయంతిలాల్‌ గడ దీన్ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ సినిమా నిర్మాత హిందీ రీమేక్‌కు సంబంధించిన ఆర్థిక అంశాలపై కోర్టును ఆశ్రయించారు. అప్పటినుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. మరోసారి ఈ సినిమా ప్రస్తావన తెరపైకి వచ్చింది కాబట్టి శంకర్‌ దీనిపై దృషి పెడతారేమో చూడాలి. 

Updated Date - Sep 09 , 2024 | 10:19 AM