Vishal: అన్ని పక్కన పెట్టేసి.. రాజకీయాల్లోకి..
ABN , Publish Date - Aug 30 , 2024 | 04:59 PM
వేరే వాళ్లను కాపీ కొట్టడం తనకు నచ్చదని చెప్పారు హీరో విశాల్(Vishal). సింపుల్‌గా జీవించడాన్నే ఇష్టపడతానని అన్నారు.
వేరే వాళ్లను కాపీ కొట్టడం తనకు నచ్చదని చెప్పారు హీరో విశాల్(Vishal). సింపుల్‌గా జీవించడాన్నే ఇష్టపడతానని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో ఓ ఎన్నికల సమయంలో నేను సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లడం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. హీరో విజయ్‌ని కాపీ కొట్టానని పలువురు వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే, అలా కాపీ కొట్టడం నాకు తెలియదు. పోలింగ్ బూత్ మా ఇంటికి దగ్గరలోనే ఉండటంతో సైకిల్‌పై వెళ్లి వచ్చా. ఇక అన్నింటినీ పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చేయడం ఉత్తమం అనిపిస్తుంది. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాను. ప్రజలకు ేసవ చేయాలనుకుంటున్నాను’’ అని అన్నారు. ఉదయనిధి స్ట్టాలిన్ గురించి చెబుతూ ఆయనతో మాట్లాడి చాలా కాలమైంది. విషయం ఏదైనా సరే తాను నిజాయితీగా మాట్లాడతానని.. అలా అందరూ ఉండలేరని చెప్పారు.
ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో (Elections) ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి విశాల్ సైకిల్‌పై రావడం అంతటా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ‘రత్నం’ (Ratnam) సినిమా ప్రమోషన్స్‌లో క్లారిటీ ఇచ్చారు. ‘‘వ్యక్తిగత కారణాల వల్ల ఆరోజు పోలింగ్ కేంద్రానికి సైకిల్‌పై వెళ్లా. విజయ్‌ను ఇమిటేట్ చేయడం కోసం అలా చేయలేదు. ప్రస్తుతం నా తల్లిదండ్రులకు మాత్రమే కారు ఉంది. నాకు లేదు. కొంతకాలం క్రితం అమ్మేశా. నగరంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. సైకిల్‌పై అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ప్రయాణించవచ్చు అనిపించింది’’ అని అన్నారు. విశాల్ నటించిన ‘రత్నం’ ఇటీవల విడుదలైంది. యాక్షన్ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన కు పరిమితమైంది. త్వరలో ఆయన ‘డిటెక్టివ్ 2’ కు సంబంధించిన వర్క్ మొదలుపెట్టనున్నారు. విశాల్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.