Raveena Tandon: ఆ వదంతులకు తావు లేదు.. ఇప్పుడే చాలా బావుంది

ABN , Publish Date - Jan 28 , 2024 | 06:57 PM

90వ దశకంలో బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న నటి ‘రవీనా టాండన్‌’. ఆ మధ్య ‘కేజీఎఫ్‌-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవీనా, ఇపుడు వెబ్‌సిరీస్‌లతోనూ పాపులర్‌ అవుతోంది. ఇటీవలే ‘కర్మ కాలింగ్‌’ అనే వెబ్‌సిరీస్‌లో రవీనా టాండన్‌ నటించింది. ఆమె చేసిన ఇంద్రాణి పాత్రకు జనాలు ఫిదా అవుతున్నారు. దీంతో రవీనా టాండన్‌ కెరీర్‌ గాడిలో పడిందనేలా కామెంట్స్ వినబడుతున్నాయి.

Raveena Tandon: ఆ వదంతులకు తావు లేదు.. ఇప్పుడే చాలా బావుంది
Raveena Tandon

90వ దశకంలో బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న నటి ‘రవీనా టాండన్‌’ (Raveena Tandon). ఆ మధ్య ‘కేజీఎఫ్‌-2’ (KGF2) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవీనా, ఇపుడు వెబ్‌సిరీస్‌లతోనూ పాపులర్‌ అవుతోంది. ఇటీవలే ‘కర్మ కాలింగ్‌’ అనే వెబ్‌సిరీస్‌లో రవీనా టాండన్‌ నటించింది. ఆమె చేసిన ఇంద్రాణి పాత్రకు జనాలు ఫిదా అవుతున్నారు. దీంతో రవీనా టాండన్‌ కెరీర్‌ గాడిలో పడిందంటున్నారు కొందరు. రవీనా మాత్రం ‘ఇదో మంచి కథ. వెబ్‌సిరీస్‌లతో మరిన్ని వైవిధ్యమైన కథలు చెప్పవచ్చు. ఈ ఫ్లాట్‌ఫామ్‌లో మంచి స్కోప్‌ ఉంది. ముఖ్యంగా కథానాయికలకు మంచి ఫుల్‌ లెంగ్త్‌ ఉన్న క్యారెక్టర్స్‌ దొరుకుతాయి. ఇదో గొప్ప అవకాశం’ అంటోంది. ఆమె గురించి కొన్ని విశేషాలు..

Raveena-1.jpg

అలా మా నాన్న వల్ల..

ఆ మధ్య కేజీఎఫ్‌-2లో ప్రధానమంత్రి పాత్రలో పవర్‌ఫుల్‌గా నటించింది. ఆమాట కొస్తే రవీనా కెరీర్‌లో ఒడిదుడుకులు ఉన్నా పట్టించుకోలేదు. చిన్న పాత్రలు చేసింది. ‘అపజయాలకు భయపడను. నాకంటూ మంచి క్యారెక్టర్‌ వచ్చే వరకూ వెతుకుతా. చిన్నప్పుడు మానాన్న చెప్పేవాడు.. ఒక పిల్లవాడు కిందపడినా.. నడిచే వరకూ నడుస్తాడు. అలా పోరాటం చివరి వరకూ చేయాలని. అందుకే నేను నడక ఆపను. వచ్చిన మంచి పాత్రలను ఎంచుకుంటా..’ నంటోంది.


Raveena-2.jpg

సోషల్‌ మీడియాతో సంతోషం..

సల్మాన్‌ఖాన్‌ జోడీగా ‘పత్తర్‌ కే పూల్‌’ చిత్రంతో 1991 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి అడుగెట్టింది రవీనా. తొలి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు గెలుచుకుంది. ‘క్షత్రియ’, ‘దిల్‌వాలే’, ‘జమానా దివానా’, ‘కీమత్‌- దే ఆర్‌ బ్యాక్‌’, ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’, ‘పరదేశీ బాబు’, ‘దావన్‌’.. ఇలా హిందీ చిత్రాలతో మెప్పించింది. ఇటీవల ఓ ఆంగ్లపత్రిక ‘మీతో పాటు జుహీ చావ్లా, శిల్పా శెట్టి, మాధురీ దీక్షిత్‌.. లాంటి వారు ఉండేవారు. మీ తోటి నటులతో గొడవలు ఉన్నాయంట కదా?’ అని అడిగితే రవీనా ఇలా చెప్పుకొచ్చింది... ‘ఆ రోజుల్లో అంటే 1990లో మ్యాగజైన్స్‌ ఎక్కువగా ఉండేవి. గాసిప్స్‌ ఎక్కువ రాసేవారు. మేమంతా స్నేహితులం. తోటి నటీమణులతో కలిసి నటించేదాన్ని. అయితే అప్పుడు మేం రూమర్స్‌ను ఆపలేకపోయాం. ఇప్పుడలా కాదు.. సోషల్‌ మీడియా ఉండటం ఎంతో సంతోషం. గొప్పగా అనిపిస్తుంది. పాతవాళ్లం అంతా ఇన్‌స్టాతో టచ్‌లో ఉంటాం. సల్మాన్‌, మాధురి.. ఇలా ఎవరిని కలిసినా ఫొటో దిగి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తాం. ఇక్కడ ప్రూఫ్‌ ఉంది. అలా రూమర్స్‌కు తావు లేదు. ఇప్పుడే చాలా బావుంది.. ఈ విషయంలో’ అంటుంది రవీనా టాండన్‌.

సహనం అలా వచ్చింది..

‘నా భర్త అనిల్‌ తడాని వల్ల ఈ స్టెబిలిటీ వచ్చింది. ఇంత సైలెంట్‌గా ఉన్నానంటే ఆయన ఆలోచనల ప్రభావమే. ఇకపోతే అమ్మ అయ్యాక.. ఎవరికైనా సహనం వస్తుంది. నాకూ అంతే! నా కూతురు, కొడుకు ఆలోచనలు, ఆశయాలు అనుగుణంగా సమయం కేటాయించాను. అందుకే సినిమాల విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోయా. వారితో కలిసి వెకేషన్స్‌కు వెళ్లటం, స్కూల్‌ ఫంక్షన్స్‌కు అటెండ్‌ అయ్యేదాన్ని. అయితే వారితో గడిపిన క్షణాలు అమూల్యమైనవి. రెండూ బ్యాలెన్స్‌ చేయటం కష్టమే కదా! ఇప్పుడిప్పుడే కాస్త సమయం దొరుకుతోంది. ఎందుకంటే పిల్లలు పెద్దవారయ్యారు కాబట్టి. ఫిల్మ్‌ఫేర్‌, జాతీయ అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ లాంటి ఉన్నత పురస్కారం గతేడాది అందుకున్నా. ఓ నటిగా ఇలాంటి అవకాశాలు, అదృష్టం దొరుకుతుంది అనుకుంటా. ఏదేమైనా ఇతరుల మీద ఆధారపడకూడదు. ఆత్మవిశ్వాసంతో యువత పని చేయాలి’ అంటుంది రవీనా టాండన్‌.


ఇవి కూడా చదవండి:

====================

*Fighter: హృతిక్ రోషన్ కెరీర్‌లో ఆ ఘనత సాధించిన 14వ చిత్రంగా ‘ఫైటర్’

***************************

*Esha Gupta: ఇక్కడ వైట్‌ స్కిన్‌ ఉండే నటులదే హవా..

***********************

Updated Date - Jan 28 , 2024 | 07:05 PM