Chiyaan Vikram: ‘తంగలాన్’.. సినిమా గ్రామర్ పాటించని సినిమా ఇది
ABN , Publish Date - Aug 14 , 2024 | 05:47 PM
విలక్షణ నటనకు చిరునామా చియాన్ విక్రమ్. ఆయన నటించిన ‘శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ’ వంటి చిత్రాలెన్నో నటుడిగా, స్టార్ హీరోగా విక్రమ్ ప్రత్యేకతను చూపించాయి. ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల్ని అలరించే చియాన్ విక్రమ్ ఇప్పుడు ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించారు. తాజాగా ఈ చిత్ర విశేషాలను హీరో విక్రమ్ మీడియాకు తెలియజేశారు.
విలక్షణ నటనకు చిరునామా చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఆయన నటించిన ‘శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ’ వంటి చిత్రాలెన్నో నటుడిగా, స్టార్ హీరోగా విక్రమ్ ప్రత్యేకతను చూపించాయి. ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల్ని అలరించే చియాన్ విక్రమ్ ఇప్పుడు ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ (Pa Ranjith) రూపొందించారు. నీలమ్ ప్రొడక్షన్స్ (Neelam Productions)తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ (Studio Green Films) బ్యానర్‌పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja) నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో చియాన్ విక్రమ్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
Also Read- Jr NTR: రెండు వారాలు విరామం అందుకే.. ఆ ఊహాగానాలు ఆపండి
‘‘నేను నటించిన ‘శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ’ వంటి మూవీస్‌లాగే ‘తంగలాన్’ కూడా ఒక డిఫరెంట్ మూవీ. ఇదొక ఎమోషనల్ మూవీ, రా కంటెంట్‌తో ఉంటుంది. ఈ స్క్రిప్ట్ చేసిన తర్వాత రంజిత్ ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాడు. సినిమా గ్రామర్ పాటించని సినిమా ఇది. పాటలు, ఫైట్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఇలా పా.రంజిత్ డిజైన్ చేయలేదు. ‘తంగలాన్’లో ఒక లైఫ్ ఉంటుంది. కొన్నిసార్లు ఒక సీన్ ఒకే షాట్‌లో చేశాము. లైవ్ సౌండింగ్‌లో చేసేవాళ్లం. ఈ సినిమా నాకొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను లైవ్ సౌండింగ్‌లో సినిమా చేయలేదు.
నా ప్రతి సినిమాలో కొంత గొంతు మార్చి మాట్లాడుతుంటా. ఈ సినిమాలోనూ అలాగే డైలాగ్స్ చెప్పాను. రోజంతా రెస్ట్ లేకుండా పనిచేసేవాళ్లం. ఆ ప్రాంతం వాళ్లు ఎలాంటి లైఫ్ లీడ్ చేశారో.. మేమూ అలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ షూటింగ్ చేశాం. నేను ఇప్పటి వరకు ఇలాంటి మూవీ చేయలేదు. ఇంత కష్టపడి చేయలేదు. దానికి కారణం.. మా డైరెక్టర్ పా.రంజిత్. ఆయన నా దగ్గరకు ఒక కమర్షియల్ కథ తీసుకురాలేదు. పా.రంజిత్ కెరీర్‌లో కమర్షియల్ మూవీస్‌తో పాటు ఆర్టిస్టిక్ మూవీస్ చేస్తూ బ్యాలెన్స్‌గా కెరీర్ సాగిస్తున్నారు. తన సినిమాలతోనే దర్శకుడిగా ఆయన ఐడియాలజీ, స్పెషాలిటీ చూపించారు. పా.రంజిత్ చేసిన గొప్ప సినిమాల్లో కచ్చితంగా ‘తంగలాన్’ ఒకటి అవుతుంది. (Chiyaan Vikram Interview)
ప్రేక్షకుల్ని ఈ సినిమా తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిర్మాత జ్ఞానవేల్ నాకు ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది మా కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ. ఇకపై కూడా మేము సినిమాలు చేస్తాం. గతంలో బాలీవుడ్ సినిమా గురించే దేశమంతా మాట్లాడుకునేది. ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి సౌత్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. ‘కేజీఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలు దీన్ని ప్రూవ్ చేశాయి. ‘ఆర్ఆర్ఆర్’తో మనం కూడా ఆస్కార్ గెల్చుకోవచ్చు అని నిరూపించారు దర్శకుడు రాజమౌళి. ఈ వేదిక నుంచి ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా.
‘తంగలాన్’లో రెండు క్యారెక్టర్స్ చేశాను. క్యారెక్టర్స్‌లో సహజంగా కనిపించేందుకు శారీరకంగా చాలా శ్రద్ధ తీసుకున్నాను. ఆహారం దొరకని పరిస్థితిలో ఉన్న క్యారెక్టర్‌లో కనిపించాలంటే నేను హీరో బాడీతో ఉంటే ఎవరికీ నచ్చదు. తెలుగు సినిమాలకు తమిళనాట ఆదరణ లేదు అనడం సరికాదు. అక్కడ తమిళ స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన పరభాషా చిత్రాలున్నాయి. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతార’ను తమిళ ఆడియెన్స్ బాగా ఆదరించారు. (Chiyaan Vikram About Thangalaan)
‘తంగలాన్’ బ్యూటీఫుల్ అడ్వెంచరస్ మూవీ. డైరెక్టర్ రంజిత్ తన ఆర్ట్ ఫామ్‌లో అందంగా రూపొందించాడు. ఇదొక మంచి సినిమా. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. రంజిత్ నా డ్రీమ్ డైరెక్టర్. ఆయనతో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఎందుకో గానీ కుదరలేదు. ఈ సినిమా గురించి ఆయన చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. సర్‌ప్రైజ్‌గా ఉండాలని సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. ఈ సినిమాలో అడ్వెంచర్, మెసేజ్, మ్యాజిక్, ఎమోషన్స్ ఉన్నాయి. ఇది నాకు దొరికిన ది బెస్ట్ రోల్ అని అనుకుంటున్నా. జ్ఞానవేల్ రాజా మాకు ఫుల్ లిబర్టీ ఇచ్చి మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఆయనకు థ్యాంక్స్. ఇది పాన్ ఇండియా కాదు వరల్డ్ స్టేజీ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానవేల్ రాజా. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ ఇష్టపడి సినిమా కోసం వర్క్ చేశారు. ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కంటెంట్‌తో కనెక్ట్ అవుతారు. పార్వతీ, మాళవిక చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు.
‘తంగలాన్’ తెలుగు, తమిళ, కన్నడ అని కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ. బంగారం వేట అనేది హైలైట్ అవుతున్నా..ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది. ఇది ఒక వర్గానికి ఆపాదించలేం. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు అసమానతలకు గురవుతూ ఉంటాం. అలాంటి వారి కోసం దర్శకుడు పా రంజిత్ సినిమా అనే మాధ్యమం ద్వారా తన అభిప్రాయాలు చెబుతున్నారు. ‘సార్పట్ట’ సినిమా చూసినప్పుడు ఆ కథలోకి లీనమవుతాం గానీ మిగతా విషయాలు పట్టించుకోం. అలాగే ఈ సినిమా కథ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టే పేర్లు, మాటలు ఈ సినిమాలో ఉండవు. ఆ జాగ్రత్తలు దర్శకుడు పా రంజిత్ తీసుకున్నారు. ‘తంగలాన్’ అనేది ఒక తెగ పేరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుక్స్ చూసినప్పుడు ఒక్కోసారి ఒక్కో అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ టైమ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇది ‘కేజీఎఫ్’లా ఉంటుందా అన్నారు. మరోసారి తెగ నాయకుడి గెటప్ రిలీజ్ చేసినప్పుడు ఇది రా అండ్ రస్టిక్ గా ఉంటుందని అన్నారు. కానీ ఈ సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి. (Chiyaan Vikram Thangalaan Interview)
ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొన్ని గంటల పాటు మేకోవర్‌కు పట్టేది. మళ్లీ మేకప్ తొలగించుకునేందుకు కనీసం రెండు గంటలు అయ్యేది. చలిలో, వేడిలో అలాగే షూటింగ్ చేశాం. మనకు ఇష్టమైన పని దొరికినప్పుడు ఆకలి, నిద్ర మర్చిపోతుంటాం. అలా నేను నా సినిమాల్లో నటిస్తున్నప్పుడు మిగతా విషయాలేవీ పట్టించుకోను. ఆ పాత్రకు తగినట్లు మారానా? లేదా? అనేదే ఆలోచిస్తాను. అవార్డులు నాకు ఇష్టమే. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు మరింత సంతోషాన్ని ఇస్తాయి. ఆఫ్రికన్ ట్రైబ్స్ సహా ప్రపంచంలోని కొన్ని తెగలు ఎలా ఉంటాయో నేను తెలుసుకున్నాను. అవి ఈ మూవీ చేయడంలో హెల్ప్ అయ్యాయి. నాతో పాటు ఆర్టిస్టులంతా సింగిల్ షాట్‌లో సీన్స్ చేశాం. ఆ సీన్‌లో 30 టేక్స్ ఉన్నా.. సింగిల్ షాట్‌లోనే చేసేవాళ్లం. ఇవాళ సినిమాకు భాషాంతరాలు లేవు. పాన్ ఇండియా అని మనమే అంటున్నాం. నేను ఎక్కడ నటించినా అది అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. థియేటర్లలో కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుంది..’’ అని తెలిపారు.
Read Latest Cinema News