Uday BommiSetty: ‘గం.. గం.. గణేశా’.. మరో రెండేళ్లకు తెరపైకి వచ్చినా కొత్తగానే ఉంటుంది

ABN , Publish Date - May 30 , 2024 | 10:24 PM

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన సినిమా ‘గం..గం..గణేశా’. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘గం..గం..గణేశా’ శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోన్న సందర్భంగా చిత్ర దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Uday BommiSetty: ‘గం.. గం.. గణేశా’.. మరో రెండేళ్లకు తెరపైకి వచ్చినా కొత్తగానే ఉంటుంది
Director Uday BommiSetty

ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha). ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి (Director Uday BommiSetty) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘గం..గం..గణేశా’ శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోన్న సందర్భంగా చిత్ర దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

*Sri Ranga Neethulu OTT: రెండు ఓటీటీలలో ‘శ్రీరంగనీతులు’.. బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్

ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను విజయేంద్రప్రసాద్‌గారి టీమ్‌లో రైటర్‌గా వర్క్ చేసేవాడిని. ఒకసారి హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ టైమ్‌లో ఈ స్టోరీ లైన్ ఫ్లాష్ అయ్యింది. నా ఫ్రెండ్, దర్శకుడు అనుదీప్ కేవీ ద్వారా ఆనంద్ దేవరకొండ టీమ్‌కు ఈ స్క్రిప్ట్ సినాప్సిస్ పంపించాను. ఆ సాయంత్రమే నాకు ఫోన్ వచ్చింది. వచ్చి ఒకసారి కలవండి అని. నేను వెళ్లి స్క్రిప్ట్ గురించి వాళ్లకున్న డౌట్స్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఆనంద్ చెప్పారు. అలా ఈ జర్నీ మొదలైంది. ఆనంద్ దేవరకొండ ఇప్పటి వరకు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. సాఫ్ట్ నేచర్ రోల్స్‌లో కనిపించాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ గ్రే షేడ్స్‌లో ఉంటుంది. చాలా ట్రిక్కీ క్యారెక్టర్ హీరోది. ఫంకీగా ఉంటూ ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ఇలాంటి క్యారెక్టర్ ఆనంద్‌కు కొత్తగా ఉంటుంది. ఎందుకంటే అతను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు చేయలేదు. అతనే కరెక్ట్ ఆప్షన్ అనిపించింది. అలా ఆనంద్‌ను అప్రోచ్ అయ్యాను.


Uday-Bommisetty.jpg

వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ విగ్రహం సంపాదించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక హీరోయిన్‌ని మాత్రం మంచి క్యారెక్టర్‌లో చూపిస్తున్నాం. మరో హీరోయిన్ నెగిటివ్‌గా బిహేవ్ చేస్తుంది. అయితే తను బ్యాడ్ కాదు పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాల్సివస్తుంది. హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా ఆ తర్వాత కర్నూల్‌కు షిప్ట్ అవుతుంది. ఈ జర్నీలో సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ హిలేరియస్‌గా ఉంటుంది. ఇటీవల మా మూవీ ప్రివ్యూ చూసిన వాళ్లు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకాస్త సేపు ఉంటే బాగుండేది అన్నారు. వాళ్లకు అంతగా నచ్చింది. ఇందులో స్పెషల్‌గా లవ్ స్టోరి అంటూ ఉండదు. కథ జర్నీలో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ వస్తారు. వాళ్లకు కీ రోల్స్ ఉన్నాయి. నయన్ సారిక, ప్రగతి శ్రీ వాస్తవ చాలా బాగా నటించారు. (Director Uday BommiSetty Interview)

ఈ సినిమా స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కథలో నేను నమ్మిన ట్విస్ట్స్ అండ్ టర్న్స్‌ను అలాగే హోల్డ్ చేస్తూ స్క్రీన్‌ప్లే సాగుతుంది. ఈ సినిమా మరో రెండేళ్లకు తెరపైకి తీసుకొచ్చినా కొత్తగా ఉంటుంది. అలాంటి స్క్రీన్‌ప్లే కుదిరింది. ఈ మూవీ మేకింగ్ టైమ్‌లో ఆనంద్ చాలా సపోర్ట్ చేశాడు. నేను అనుకున్న క్యారెక్టర్‌లో బాగా పెర్ఫార్మ్ చేశాడు. ఎడిట్ టేబుల్ మీద ఆనంద్ నటన చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. డైలాగ్ డెలివరీ, టైమింగ్, రియాక్షన్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాకు ఆయన పెర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. కమర్షియల్ హీరోకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఆయన క్యారెక్టర్‌లో కనిపిస్తాయి.

భయం, అత్యాశ, కుట్ర అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే కొందరిలో కొంత మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు లక్షణాలు కొందరు మనుషులను ఎలాంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లాయి అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. నేను ఈ ప్రాజెక్ట్ కోసం వెళ్లేప్పటికే ‘బేబి’ సినిమా షూట్‌కు రెడీ అయింది. ఆ తర్వాత సమాంతరంగా రెండు సినిమాలు షూటింగ్ చేశాం. ‘బేబి’లో ఎమోషనల్ కంటెంట్, మా మూవీలో ఎనర్జిటిక్, కామెడీ క్యారెక్టర్ ఆనంద్ చేయాలి. ఈ రెండు సినిమాల మధ్య షిప్టింగ్ ఆనంద్‌కు ఛాలెంజింగ్‌గా ఉండేది. ‘బేబి’ సినిమా సక్సెస్ తర్వాత మా మూవీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఆనంద్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారు.

విజయేంద్రప్రసాద్ గారి పుట్టినరోజు విష్ చేసేందుకు వెళ్తే ‘గం..గం..గణేశా’ కథను మరోసారి చెప్పించుకుని విని బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాతో హిట్ కొడుతున్నావ్ అని బ్లెస్ చేశారు. ఆయనకు మా కథ నచ్చడం నాలోని కాన్ఫిడెన్స్ పెంచింది. ఆనంద్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా ఈ సినిమా చూశారు. వాళ్లకు మూవీ బాగా నచ్చింది. నేను పూరి జగన్నాధ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అయితే రాజమౌళిగారి సినిమాల్లోని డ్రామా చాలా ఇష్టం. మనకు సినిమా చూసేప్పుడు డ్రామా మన మనసులకు రీచ్ అవుతుంది. అలాంటి యాక్షన్ డ్రామా మూవీస్ చేయాలని ఉంది. నా నెక్ట్ మూవీ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - May 30 , 2024 | 10:24 PM