Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’.. మళ్ళీ మళ్ళీ చూసేలా వుంటుంది

ABN , Publish Date - Aug 13 , 2024 | 08:15 PM

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Director Harish Shankar

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మించిన ఈ సినిమా ప్రిమియర్స్ ఆగస్ట్ 14 సాయంత్రం నుంచి వుండబోతున్నాయి. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటించింది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. (Harish Shankar Interview About Mr Bachchan Movie)

ఈ సినిమాకు ‘ది ఓన్లీ హోప్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు కదా.. దీనికి కారణం?

ఇందులో హోప్ హీరో క్యారెక్టరైజేషన్. ఈ సినిమా చేయడానికి రీజనే హానెస్టీ వున్న హీరోయిజం. ఇదొక ట్రూ ఇన్సిడెంట్. 80s ప్రాంతంలో నార్త్ ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేసిన కథ. ఆ రోజుల్లో లక్షల రూపాయల లంచం ఇస్తామని ఆఫర్ చేసినా సరే.. ఓ ఆఫీసర్ ఎక్కడా లొంగలేదు. నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది.

‘రైడ్’తో పోలిస్తే.. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎలా బిల్డ్ చేశారు?

‘రైడ్’కి, దీనికి... అజయ్ దేవగన్‌కి, రవితేజకి ఉన్నంత డిఫరెన్స్ వుంటుంది. రవితేజ‌గారికి తగ్గట్టు సినిమా వుంటుంది. హానెస్ట్ వున్న వ్యక్తుల జీవితంలో ఫన్ రొమాన్స్ లవ్ అన్నీ వుంటాయి. ఇందులో తన ప్రేమలో నిజాయితీ వుంటుంది. తను చేసిన ఫైట్‌లో నిజాయితీ వుంటుంది. నిజాయితీ అనే పాయింట్ నుంచే అన్నీ వచ్చాయి. ‘రైడ్’ సీరియస్‌గా వుంటుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకటే బ్యాక్ డ్రాప్‌లో వుంటుంది. అలా చూసినప్పుడు ఆడియన్స్‌కి కొంచెం స్ట్రెస్ వస్తుంది. ఇందులో అది ఎవైడ్ చేశాం. ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా వచ్చిందో సినిమా చూసేటప్పుడు అర్థమైపోతుంది.

కమర్షియల్ సినిమా టెంప్లెట్ ఇలా వుండాలని మిమ్మల్ని ఇన్ఫ్లూయిన్స్ చేసింది ఎవరు అంటే..?

మా నాన్నగారు. ఆయన అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడే నాకు సినిమా ఇష్టమని ఆయనకి అర్థమైపోయింది. చిన్నప్పటి నుంచే తెలుగు, హిందీ లిటరేచర్, సినిమాలు అంటే ఇష్టం. జంధ్యాల గారు, బాపు రమణ గారు సినిమాల్లో మాటలు విపరీతంగా వినేవాడిని. అలాగే ఈవీవీ గారి సినిమాలకి కూడా ఎట్రాక్ట్ అయ్యాను.


Harish-1.jpg

మీ సినిమాల్లో పాటలు సూపర్ హిట్. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ పాటలన్నీ హిట్.. మిక్కీ తో వర్క్ చేయడం గురించి?

ఈ సినిమాకు మ్యూజిక్ అంతా వన్ వీక్‌లో చేశాం. వన్ వీక్‌లో నాలుగు చార్ట్ బస్టర్ ట్యూన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. డైరెక్టర్‌గా కొన్ని సార్లు ఫెయిల్ అయినా.. నా పాటలు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఆదిత్య మ్యూజిక్ వారు హరీష్ శంకర్ హిట్స్ అని క్యాసెట్ రిలీజ్ చేశారు. నాకు మొదటి నుంచి పాటలు చాలా ఇష్టం. ‘గద్దల కొండ గణేష్’ లో అన్ని పాటలు హిట్టు. మిక్కీ మోస్ట్ అండర్ రేటెడ్ కంపోజర్ అని నా ఫీలింగ్. మిక్కీ చాలా మితభాషి. మా ఇద్దరి కాంబినేషన్ బాగా మ్యాచ్ అయ్యింది.

లిరిక్స్ విషయంలో కూడా చాలా జాగ్రతలు తీసుకుంటారు కదా?

నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం చాలా ఇష్టం. సినిమా చూడని రోజు వుంటుందేమో కానీ పాట వినని రోజు వుండదు. ఒక మంచి వాక్యం ఇచ్చిన స్ఫూర్తి మరేది ఇవ్వలేదు. నాకు మ్యూజిక్ ఒక థెరపీ. ముఖ్యంగా లిరిక్స్‌ని చాలా శ్రద్ధగా వినడం, స్ఫూర్తి పొందడం అలవాటు. ‘మా ఊపిరి నిప్పుల ఉప్పెన.. మా ఊహల కత్తుల వంతెన’(వేటూరి) ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు గొప్ప ఎనర్జీ వస్తుంటుంది. నా పాటలు కూడా ఇలా లిరిక్స్ తో గుర్తు చేసుకోవాలనేది తాపత్రయం. ఇందులో కాసర్ల శ్యామ్, వనమాలి, భాస్కర భట్ల, సాహితీ చాలా చక్కని సాహిత్యం రాశారు.

క్యాసెట్ రికార్డింగ్ సెంటర్స్ వున్న రోజులో జరిగే కథ ఇది. అప్పట్లో భాహాటంగా పోస్టర్లు పెట్టి క్యాసెట్ రికార్డ్స్ చేసేవారు. ఆ టైంని గుర్తు చేద్దామని లిరికల్ వీడియోలో అమితాబ్ గారు, చిరంజీవి గారి పోస్టర్స్ చూపించడం జరిగింది. నేను బిహెచ్ఈల్‌లో పెరిగాను. అక్కడ ఓ మంచి లవ్ స్టోరీ తీయాలని ఎప్పటి నుంచో కోరిక. అయితే నాకున్న మాస్ ఇమేజ్‌కి తీయడం కుదరలేదు. ఈ సినిమాలో ఆ ప్రేమ కథ కోరిక ఎంతో కొంత తీరింది. ఇందులో లవ్ స్టోరీ బ్యూటీఫుల్‌గా వుంటుంది. (Harish Shankar Interview)

ఇందులో రవితేజ గారిని ఎలా చూపిస్తున్నారు?

ఎవరూ చూడని బ్యాగ్ డ్రాప్‌లో మనం మర్చిపోయిన జ్ఞాపకాలని గుర్తు చేస్తూ, మనకి గుర్తున్న జ్ఞాపకాల్ని చూపిస్తూ, రవితేజ గారి నుంచి ఏం ఆశిస్తారో అలాంటి ఎలిమెంట్స్‌తో సినిమాని తీర్చిదిద్దాం. సెకండ్ హాఫ్‌లో రవితేజగారి పెర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ చాలా కొత్తగా ఫీలౌతారు. నటుడిగా ఆయనలో ఒక కంప్లీట్ నెస్ కనిపించింది. ఐటీ ఆఫీసర్‌కి సూట్ అయ్యేలా రవితేజ‌గారు తనని మలచుకున్నారు, రవితేజ‌గారికి సూట్ అయ్యేలా కథని మలుచుకున్నాం. రెండు బ్యాలెన్స్ చేశాం.

ఈ సినిమాని చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేశారు కదా.. నిర్మాత సపోర్ట్ గురించి?

విశ్వప్రసాద్‌గారు లేకపోతే ఈ సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చేది కాదు, 15న రిలీజ్ చేసేవాళ్ళం కాదు. మార్కెట్, ఫైనాన్సియల్ ఈక్వేషన్స్ తో సంబంధం లేకుండా మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నప్పుడు కళ్యాణ్ గారు (Pawan Kalyan) ఎలక్షన్స్‌లో బిజీ అయ్యారు. కాంపెయిన్ నుంచి రిజల్ట్ వచ్చేవరకూ ఈ సినిమా ఫినిష్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాం. రవితేజ‌గారు లాంటి హీరో, విశ్వప్రసాద్‌గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడంతో అనుకున్న సమయానికి కంప్లీట్ అయ్యింది.

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి?

90s బ్యాక్ డ్రాప్‌లో ఒక వీధిలో జిక్కీ అనే అమ్మాయి వుండాలి అన్నప్పుడు.. ఆ అమ్మాయికి గత సినిమాల ఇమేజ్ ఉండకూడదని కొత్త అమ్మాయిని తీసుకున్నాం. తను చాలా హార్డ్ వర్క్ చేసింది, అద్భుతంగా పెర్ఫార్ చేసింది.

ఇందులో జగపతి బాబుది డ్యూయల్ రోల్ అంటున్నారు నిజమేనా?

లేదు.. సింగిల్ రోలే. ఆయన ఒక ఎంపీగా కనిపిస్తారు.


Harish-2.jpg

ఇందులో నాలుగు ఫైట్స్ వున్నాయి కదా.. మాస్ ఆడియన్స్‌కి హై ఎలా వుంటుంది?

ఈ నాలుగు ఫైట్లే పది ఫైట్ల ఇంపాక్ట్ ఇస్తాయి. రవితేజ గారి సినిమా అంటే మాస్‌తో పాటు ఫ్యామిలీస్ కూడా చూస్తారు. ఈ సినిమా హోల్సమ్ ఎంటర్‌టైనర్.

డీవోపీ అయనంక బోస్‌తో పని చేయడం గురించి?

ఇది మేము కలసి చేసిన నాలుగో సినిమా. మరో పది సినిమాలు చేయడానికి సిద్ధంగా వున్నాం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నా విజన్‌ని మార్చారు. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్‌గా వుంటుంది.

ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి గురించి?

‘కేజీఎఫ్’ చూసిన తర్వాత నన్ను ఫస్ట్ ఎట్రాక్ట్ చేసింది ఎడిటింగ్. చాలా నచ్చింది. అప్పుడే ఎడిటర్ గురించి అడిగాను. ఒక రోజు నా ఆఫీస్‌కి వచ్చాడు. తనని చూసి షాక్ అయ్యా. ఇరవై మూడేళ్ళ కుర్రాడు. తనతో ఇంటరాక్షన్ బాగా నచ్చింది. మొదట ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి పెట్టాను.

ఈ సినిమా గురించి ఆడియన్స్‌కి ఏం చెప్తారు?

‘మిస్టర్ బచ్చన్’ మళ్ళీ మళ్ళీ చూసేలా వుంటుంది. ఖచ్చితంగా సినిమా రిపీట్ ఆడియన్స్ వచ్చేలా వుంటుంది. ఆగస్ట్ 14 సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రీమియర్స్ వుంటాయి. ఆగస్ట్ 15న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.

Read Latest Cinema News

Updated Date - Aug 13 , 2024 | 08:15 PM

Mr Bachchan: రవితేజ, హరీష్ శంకర్.. ఏందయ్యో ఈ స్పీడ్.. అప్పుడే క్లాప్ కూడా!

Mr Bachchan: మాస్ మ‌హారాజ్ ‘మిస్టర్ బచ్చన్’ ట్రైల‌ర్‌

Mr Bachchan: రవితేజ ‘మిస్టర్ బచ్చన్‌’లో జగ్గు భాయ్ అవతార్ చూశారా..

Mr Bachchan: ‘నల్లంచు తెల్లచీర’ లిరికల్ సాంగ్

Mr Bachchan: జిక్కి లిరికల్ వీడియో సాంగ్