Tenant: ఎవరితోనో పోటీ పడాలనే కోరిక నాకు లేదు: సత్యం రాజేష్

ABN , Publish Date - Apr 17 , 2024 | 04:23 PM

‘పొలిమేర-2’తో ఊహించని సక్సెస్ అందుకున్న సత్యం రాజేష్ ఇప్పుడు కథానాయకుడిగా ‘టెనెంట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వై.యుగంధర్‌ దర్శకుడు. మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మాత, ఈ నెల 19న విడుదలవుతోంది. ఇది ఒక క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సాహిత్య సాగర్ సంగీతం అందించాడు. ఈ సినిమా గురించి సత్యం రాజేష్ మీడియాతో బుధవారం చిట్‌చాట్ నిర్వహించారు.

Tenant: ఎవరితోనో పోటీ పడాలనే కోరిక నాకు లేదు: సత్యం రాజేష్
Satyam Rajesh

టెనెంట్ ఎవరు? ఎవరు ఎవరింటికి వస్తున్నారు? ఏంటి ఈ సినిమా కథ?

ఇది ఎదురింట్లో లేదా పక్కింట్లో జరిగే కథ. భార్యభార్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూపించే కథ. ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగే స్టోరీ. అన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లాగే ఉంటాయి. డైరెక్టర్ ఏం చెప్పారో అది పర్‌ఫెక్ట్‌గా తీశారు. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. సినిమా థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పేలా ఉంటుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తుంది.

satyamrajeshone.jpg

టెనెంట్‌కు ‘A’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు?

సినిమా ట్రైలర్‌లో మేడమీద నుంచి పడి చనిపోయే సీన్ ఉంది కదా, అది సినిమాటిక్‌గా చూపిస్తే క్లీన్ సర్టిఫికెట్ వస్తుంది. కానీ రియాలిటీకి దగ్గరగా చూపిస్తేనే ఆడియన్స్‌కు ఒరిజినల్ ఫీల్ కలుగుతుంది. ఈ సీన్‌ను రియాలిటీకి దగ్గరగా చూపించడం వల్లే ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి.

మీరు ఇలాంటి సినిమాలనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు?

నేను మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు యాక్షన్, డ్యాన్స్‌లు, రొమాంటిక్, మాస్ ఎలిమెంట్స్, భారీ బడ్జెట్ లాంటి సినిమాలను ఎంచుకోను. నేను ఆర్టిస్ట్‌గా చేస్తూనే, మంచి పాయింట్ ఉన్న సినిమాలు చేయాలనేది నా కోరిక. ఇప్పుడు ఎవరితోనే పోటీ పడాలనే కోరిక నాకు లేదు.

ట్రైలర్‌లో ఎడిటింగ్ కట్స్ బాగున్నాయి. సినిమాలో షార్ట్సే వాడారా? ట్రైలర్ కోసం సెపరేట్‌గా కట్ చేయించారా?

ఒక్క షాట్ కూడా ట్రైలర్ కోసం అని చేయలేదు. అన్నీ సినిమాలో షార్ట్సే వాడాము. డైరెక్టర్ యుగంధర్ గారు కథ చెప్పినప్పుడే నేను హ్యాపీ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను కథ వింటూనే ఉన్నా. ఇది భలే ఉందే అని ఫీలయిన కథ ఇది.

satyamrajeshtwo.jpg

ఇది ఓటీటీ కోసం తీసిన కథ అని చెప్పారు. కానీ థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు. ‘పొలిమేర-2’తో సక్సెస్ రావడం వల్ల థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారా?

కథ చాలా బాగుందని చిన్న సినిమాగా స్టార్ చేశాం. ఓటీటీ కోసమే అనుకుని చేస్తున్న క్రమంలో సినిమా అవుట్‌పుట్ చూసుకుంటే అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. అందుకోసం ఇంకా ఇంప్రూవ్ చేశాం.

ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలకు రైటింగ్ చాలా ముఖ్యం. ఈ సినిమా రైటింగ్‌లో ఉన్న మ్యాజిక్ ఏంటి?

ఈ సినిమా కథను వర్మ శ్రీనివాస్ గారు రాశారు. ఆయన రైటింగ్ చాలా నేచురల్‌గా ఉంది. ఇందులో ఓవర్ డైలాగ్స్ ఉండవు. సినిమాలో నేను మాట్లాడేదే చాలా తక్కువ ఉంటుంది. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది.

మీరు అన్నీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు కదా.. మీరు పర్టికులర్‌గా ఇలాంటివే సెలెక్ట్ చేసుకుంటున్నారా? లేక ఇలాంటి కథలే మీ దగ్గరికి వస్తున్నాయా?

నా దగ్గరకు వచ్చిన వాటిలో నేనే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేని సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో పది కాలాలపాటు చల్లగా ఉంటాం. పోటీలో దిగి ఫైట్ చేసి ఓడిపోతే ఇంటికి వెళ్లిపోవాలి. మనం కుమ్మేస్తా, కొట్టేస్తాం అని చెప్పే అలవాటు నాకు లేదు. నా జీవితం ఏంటో అందరూ చూసేశారు కదా. నాకు నప్పే సినిమాలనే నేను చేస్తా.

satyamrajeshthree.jpg

థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.. పొలిమేర-2లో కూడా మ్యూజిక్ బాగా హైలైట్ అయింది. ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుంది?

ఈ సినిమాకు సాహిత్య సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్కే ప్రాణం. క్లైమాక్స్‌లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేనే అలా అలా పాజ్ అయ్యా. ఒక ఆడియన్‌లాగా నాకే కన్నీళ్లు వచ్చాయి. సినిమాలో మ్యూజిక్ ఫీల్ అంతగా ఉంటుంది. సాహిత్య సాగర్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.

ఇకపై కథానాయకుడుగానే చేస్తారా? ఆర్టిస్ట్‌గా కూడా కొనసాగుతారా?

నేను ఆర్టిస్టుగా చేస్తా. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేస్తున్నా. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే, నాకు సూట్ అవుతాయనుకుంటేనే కథానాయకుడిగా చేస్తా.

కథానాయకుడు అంటే చాలామంది ఎలివేషన్స్ కోరుకుంటారు, మీ సినిమాల్లో అలాంటివి లేవు. భవిష్యత్తులో ఏమైనా ఉంటాయా?

నాకు అలాంటి ఎలివేషన్స్ నచ్చవు. నేను మెయిన్ క్యారెక్టర్‌లో స్ట్రీట్ ఫైట్ అనే ఒక కామెడీ సినిమా చేస్తున్నా. అందులో ఎలివేషన్స్ ఉండవు కానీ, కమర్షియల్ సినిమాలా ఉంటుంది.

satyamrajesh1.jpg

మీ కెరీర్‌లో ‘క్షణం’ చెప్పుకోదగ్గ సినిమా కదా.. అలాంటి క్యారెక్టర్స్ మీ దగ్గరకు రాలేదా? వచ్చినా మీరు చేయలేదా?

క్షణం తర్వాత దగ్గర దగ్గర 50 సినిమాల్లో పోలీస్ రోల్స్ వచ్చాయి. కానీ మళ్లీ అలాంటి పాత్రలే చేస్తే బాగోదని చేయలేదు. కొన్ని పోలీస్ పాత్రలు కామెడీ చేసేలా ఉంటాయి. అలాంటివి చేయను. కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటే చేయొచ్చు. ప్రకాష్ రాజ్, రఘువరన్ లాంటి వాళ్లలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేది నా కోరిక.

టెనెంట్‌లో ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఎంతవరకూ ఉంటాయి?

ఈ సినిమాలో ట్విస్ట్‌లు ఉండవు కానీ.. సస్పెన్స్ ఉంటుంది. మర్డర్ మిస్టరీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ చూసి ఆడియన్స్ సింపతీతో బయటకు వస్తారు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు?

'స్ట్రీట్ ఫైట్' అనే సినిమాలో నేను మెయిన్ లీడ్‌ చేస్తున్నా. మాస్ మహారాజా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

Updated Date - Apr 17 , 2024 | 04:23 PM