Rajkumar Periasamy: ‘అమరన్’ చూసిన కమల్ హాసన్, రియల్ ఇందు మేడమ్ స్పందనిదే..
ABN , Publish Date - Nov 05 , 2024 | 06:20 PM
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన నేషన్ ప్రైడ్ బ్లాక్‌బస్టర్ ‘అమరన్’. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ.. పాజిటివ్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మీడియాతో ముచ్చటించారు. ఆయన ఏమన్నారంటే..
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన నేషన్ ప్రైడ్ బ్లాక్‌బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ.. పాజిటివ్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మీడియాతో ముచ్చటించారు.
‘అమరన్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.. మీ ఫీలింగ్ ఏంటి?
అందరికీ థాంక్యూ. ‘అమరన్’కి యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. సినిమాని ఇంతగొప్పగా ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్‌కి థాంక్ యూ సో మచ్. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. ఈ సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది.
కమల్ హసన్గారు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు?
కమల్ హసన్గారు వండర్ ఫుల్ పర్శన్. ఈ సినిమాకి బిగినింగ్ నుంచి చివరి వరకూ చాలా సపోర్ట్ ఇచ్చారు. నాపై ఎంతో నమ్మకం ఉంచారు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. విడుదలకు ముందు ఆయనకి సినిమా చూపించాను. చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా చోట్ల ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఫీమేల్ పర్స్పెక్టివ్ నుంచి ఈ కథని డ్రైవ్ చేయడం ఆయనకు చాలా నచ్చింది. ‘ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్‌ని చాలా అద్భుతంగా తీసావ్’ అని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసలు ఎప్పటికీ మరిచిపోను. (Rajkumar Periasamy Interview)
Also Read-Nivetha Pethuraj: బాలుడి చేతిలో మోసపోయా
శివకార్తికేయన్, సాయి పల్లవి పాత్రల గురించి?
ఈ కథ రాస్తున్నప్పుడే ఇందు క్యారెక్టర్‌కి సాయి పల్లవి అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. రియల్ ఇందు మేడంని కలిసిన తర్వాత ఆ క్యారెక్టర్‌కి సాయి పల్లవి అయితేనే పర్ఫెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే చాలా జెన్యూన్, ఎమోషన్ హై వున్న క్యారెక్టర్ అది. హీరో విషయానికి వస్తే.. కథ రాస్తున్నప్పుడు హీరో ఎవరనేది నా మైండ్‌లో లేదు. ఈ కథని శివ కార్తికేయన్‌గారికి చెప్పాను. ఆయనకి ఈ కథ చాలా నచ్చింది. చాలా కనెక్ట్ అయ్యారు. ఇంతకుముందు ఆయన ఇలాంటి సినిమాలు చేయలేదు. ‘అమరన్’ వంటి ఫుల్ ప్లెడ్జ్ యాక్షన్ రోల్ చేయలేదు. అందుకే సినిమా చాలా ఫ్రెష్‌గా కనిపించింది. ఆయన ఈ కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్టు చేసేస్తానని చెప్పారు. తర్వాత కమల్ సార్‌ని కలిశాం. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది.
ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన అంశాలు ఏంటి?
ఇది రియల్ కథ. ఈ కథకు ప్రారంభం, ముగింపు తెలుసు. అలాంటి కథని ఆడియన్స్‌కి ఎంగేజింగ్‌గా చెప్పడం.. రియాల్టీని, ఫిక్షన్ని బ్యాలెన్స్ చేయడం, ఒరిజినల్ ఇన్సిడెంట్‌ని రీ క్రియేట్ చేయడం ఇవన్నీ ఛాలెంజెస్ అనుకోను గాని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. నాకు రియలిజం ఉన్న సినిమాలు ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. యాక్షన్స్ సీక్వెన్స్ చేయడం, అలాగే కాశ్మీర్లో తీసిన సీక్వెన్సులు ఇవన్నీ ఛాలెంజ్‌తో కూడుకున్నవి. నేను ప్రతి యాక్షన్ పార్ట్‌ని క్లియర్‌గా రాసుకున్నాను. ప్రతి షాట్‌ని పేపర్ మీద ప్లాన్ చేసుకున్నాను. అవన్నీ స్క్రీన్ మీదకు అచీవ్ చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్. (Rajkumar Periasamy About Amaran Movie)
జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి?
జీవి ప్రకాష్ ఈ సినిమాకి పిల్లర్ స్ట్రెంత్. చాలా కొత్త మ్యూజిక్ ఇచ్చారు. సోల్ ఫుల్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేశారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్‌తో పని చేయడం నిజంగా నా అదృష్టం.
నిర్మాతల గురించి?
కమల్ హాసన్ గారు, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్‌తోనే సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చింది. అలాగే ఈ సందర్భంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ ఫ్యామిలీకి థాంక్స్ చెబుతున్నాను.
ఇందు రెబకావర్గీస్గారు సినిమా చూసిన తర్వాత ఎలా ఫీలయ్యారు?
ఇందు గారికి ఈ సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నైలో చూశారు. సినిమా చివరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయ్యారు.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి?
ప్రస్తుతం చర్చల్లో జరుగుతున్నాయి. త్వరలోనే చెబుతాను.