Regina Cassandra: ‘ఉత్సవం’.. సందేశాత్మక చిత్రం కాదు

ABN , Publish Date - Sep 10 , 2024 | 07:40 PM

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటించిన.. అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా చిత్రం ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి రానున్న ఈ చిత్ర విశేషాలను రెజీనా కసాండ్రా మీడియాకు తెలియజేసింది.

Heroine Regina Cassandra

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటించిన.. అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా చిత్రం ‘ఉత్సవం’ (Utsavam). హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఇప్పటికే జనాల్లోకి వెళ్లిన ఈ సినిమా.. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఏపీ, తెలంగాణలలో సెప్టెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra) మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

‘ఉత్సవం’లో మిమ్మల్ని ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏమిటి?

డైరెక్టర్ అర్జున్ సాయి ఈ కథ నెరేట్ చేసినప్పుడు అద్భుతంగా అనిపించింది. ఈ కథలో సోల్ వుంది. నాటక రంగం గురించి ఆయన చాలా రీసెర్చ్ చేసి ఈ కథని రాసుకున్నారు. అలాగని ఇది సందేశాత్మక చిత్రం కాదు. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న రూటెడ్ స్టోరీ ఇది. అది నాకు చాలా నచ్చింది. అందుకే స్టోరీ వినగానే ఈ కథను మిస్ అవ్వకూడదనిపించింది. అర్జున్ సాయి సెన్సిబుల్ డైరెక్టర్. ఆడియన్స్‌ని థియేటర్స్‌‌కి తీసుకురావడానికి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో తెలిసిన డైరెక్టర్. చాలా అద్భుతమైన నటులు ఇందులో వున్నారు. అలాగే డీవోపీగా రసూల్ గారు, మ్యూజిక్ అనూప్ రూబెన్స్.. ఇలా అన్నీ చక్కగా కుదిరాయి.


Regina.jpg

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

ఇందులో నేను కార్పోరేట్ ఎంప్లాయ్‌గా కనిపిస్తాను. తనకి లవ్ మీద పెద్ద ఇంప్రెషన్ వుండదు. చాలా ఇండిపెండెంట్. నా క్యారెక్టర్ ఇండిపెండెంట్ విమెన్ రిలేట్ చేసుకునేలా వుంటుంది. కథలో చాలా కీలకంగా వుంటుంది. ఈ క్యారెక్టర్ చేయడం చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది.

మీరు చిన్నప్పడు స్టేజ్ ప్లేస్ చేసేవారా?

నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ప్లేస్ ఇష్టం. స్కూల్, కాలేజ్ డేస్‌లో ప్లే చేశాను. ఈ సినిమాలో రంగస్థలం నటులు గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలు వున్నాయి. అవన్నీ ఆడియన్స్‌ని హత్తుకునేలా వుంటాయి. (Regina Cassandra About Utsavam)

దిలీప్ ప్రకాష్ గురించి?

దిలీప్ హార్డ్ వర్కింగ్ యాక్టర్. చాలా పాజిటివ్ సోల్. ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్‌తో వుంటారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తనతో వర్క్ చేసేప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. తనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరూ చాలా సిన్సియర్‌గా పని చేశారు. ప్రకాష్ రాజ్‌గారు, నాజర్‌గారు థియేటర్స్ నుంచే వచ్చారు. వారితో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. చాలా నేర్చుకున్నాను కూడా.

మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది?

ఇది చాలా మంచి సినిమా. డైరెక్టర్ అర్జున్ సాయి తన తొలి సినిమాగా ఇలాంటి గొప్ప కథని చెప్పాలని అనుకున్నారు. దీనికి మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద సంస్థ సపోర్ట్ చేయడం, వారు తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది.

షార్ట్ టైం గోల్స్ ఉన్నాయా?

నా ఫస్ట్ సినిమా ఎస్ఎంఎస్ చేసినప్పుడే వెర్సటైల్ యాక్టర్‌గా వుండాలని భావించాను. అది నా నుంచి ఎప్పుడూ దూరం కాకుండా ఇన్నాళ్ళు పాత్రలు చేసుకుంటూ వచ్చాను. నేను చేయగల అన్ని రకాల పాత్రలు చేయడమే నా గోల్.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి..

గోపిచంద్ మలినేని, సన్నీ డియోల్ కాంబో మూవీలో చేస్తున్నాను. హిందీలో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ వున్నాయి. అవి మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

Read Latest Cinema News

Updated Date - Sep 10 , 2024 | 07:40 PM