Masthu Shades Unnai Ra : అభినవ్ గోమఠం హీరోగా.. ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’!
ABN , Publish Date - Jan 22 , 2024 | 03:21 PM
ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం. అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అతని పాపులర్ డైలాగ్ అయిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభినవ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది.
ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అతని పాపులర్ డైలాగ్ అయిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా (Masthu Shades Unnai Ra) టైటిల్‌తోనే అభినవ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్. కాసుల క్రియేటివ్ వర్క్స్ (Kasula Creative Works ) పతాకంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిమేర-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి, మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు సంపాందిచుకున్న నిర్మాత, పంపిణీదారుడు వంశీ నందిపాటి (Vamsi Nandipati) ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రం టైటిల్ లోగోను దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో పాటు, ఓ కాలేజీలో జరిగిన వేడుకలో అక్కడి విద్యార్థులు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ హాస్యనటుడిగా, సహాయ నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న అభినవ్ గోమఠం (Abhinav Gomatam) లోని కొత్త కోణాన్ని, నటుడిలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. అయోధ్యలోని శ్రీ సీతారాముల ప్రాణ పతిష్ట రోజే మా సినిమా మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా (Masthu Shades Unnai Ra) లోగోను ఆవిష్కరించడం ఎంతో లక్కీగా భావిస్తున్నాం. అన్నిభావోద్వేగాల మేళవింపుతో లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. కొత్తదనంతో కూడిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. ఫిబ్రవరి ద్వితియార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
ఇంకా ఈ మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా (Masthu Shades Unnai Ra) సినిమాలో తరుణ్‌భాస్కర్ (Tharun Bhascker), అలీ రేజా (Ali Reza), మొయిన్, చక్రపాణి ఆనంద్, నిళగల్ రవి, జ్యోతి రెడ్డి, లావణ్య రెడ్డి, శ్వేత అవస్థి, రవీందర్ రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, సాయిక్రిష్ణ, ఫణి చంద్రశేఖర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్థ స్వయంభూ, ఎడిటర్: రవితేజ గిరిజాల, ఆర్ట్: శరవణన్ వసంత్, కథ: అన్వర్ సాథిక్, డైలాగ్స్: రాధామోహన్ గుంటి, సంగీతం: సంజీవ్ టి, నేపథ్య సంగీతం: శ్యాముల్ అబే, ఎడిటర్ రవితేజ గిరిజాల.