Brahmaji: ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా.. మంత్రి గారు! నెటిజ‌న్‌కు కౌంట‌ర్‌

ABN , Publish Date - Oct 04 , 2024 | 11:09 AM

తాజాగా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్న మంత్రి సురేఖ వీడియోపై టాలీవుడ్ క్యారెక్ట‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ వ్యంగ్యంగా స్పందిస్తూ ఓ పోస్టు పెట్టాడు. ఇప్పుడ‌ది బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Brahmaji

గ‌త రెండు రోజులుగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) హీరో నాగార్జున (Nagarjuna) ఫ్యామిలీపై చేసిన విమ‌ర్శ‌లు రెండు తెలుగు రాష్ట్రాలు, టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌తో సినీ ప‌రిశ్ర‌మ అంతా క‌లిసి వ‌చ్చి ముక్త‌కంఠంతో మంత్రి వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌గా నాగార్జున కొర్టు మెట్లు సైతం ఎక్కారు. అప్ప‌టికే మంత్రి సురేఖ కూడా దిగి వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో పాటు త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకుంది. కానీ తాజాగా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్న సురేఖ మ‌ట్లాడిన‌ మ‌రో వీడియోపై టాలీవుడ్ క్యారెక్ట‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ (Brahmaji) వ్యంగ్యంగా స్పందిస్తూ ఓ పోస్టు పెట్టాడు. ఇప్పుడ‌ది బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

brahmaji1.jpg

అయితే తాజా మంత్రి సురేఖ మాట్లాడిన మ‌రో వీడియో ఇప్పుడు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తోంది ఆ వీడియోలో హీరోయిన్ సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనకు ఆగ్రహం వచ్చినందుకే వాస్తవాలు మాట్లాడాన‌న్నారు. అయితే ఇప్పటి వరకు నాగ చైతన్య, సమంతలు త‌మ‌ విడాకుల విషయంలో అస‌లు నిజాలేంటో బయటి ప్రపంచానికి తెలియదన్నారు. అయితే టాలీవుడ్ నుంచి తనకు అంతర్గతంగా వచ్చిన విషయాన్నే చెప్పానని అన్నారు. ఇక‌ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విష‌యంలో త‌గ్గేదే లేద‌ని అన్నారు.


brahmaji.JPG

అయితే టాలీవుడ్ క్యారెక్ట‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ (Brahmaji) ఈ లేటెస్ట్ వీడియోపై స్పందించారు. ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా …మంత్రి గారు 🙏🏼🙏🏼.. అంటూ ఓ పోస్టు పెట్టాడు. ఇప్పుడ‌ది సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. చాలామంది బ్ర‌హ్మాజీ పోస్టుపై రియాక్ట్ అవుతున్నారు. కొంత‌మంది బ్ర‌హ్మాజికి మ‌ద్ద‌తునిచ్చేలా కామెంట్లు పెడుతుండ‌గా.. మ‌రి కొంత‌మంది బూతుల‌తో కామెంట్లు చేస్తున్నారు. వాటిల్లో ఓ నెటిజ‌న్ వాడిన ప‌ద‌జాల‌న్ని రీ ట్వీట్ చేస్తూ న‌న్ను తిట్టాలంటే ఓన్ అకౌంట్‌తో, డీపీ పెట్టుకుని తిట్టాలని.. ప్ర‌భాస్‌ నా దేవుడు ఆయ‌న డీపీ పెట్టుకుని న‌న్ను తిట్టితే అత‌న్ని తిట్టిన‌ట్టు అవుతుంద‌ని ఫ్యాన్స్ ఫీల్‌ అవుతార‌ని రిప్లై ఇచ్చాడు. ప‌నిలో ప‌నిగా మీ అమ్మ‌ను అడిగిన‌ట్లు చెప్పండి సార్ అంటూ త‌నదైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు.

bra.JPG

Updated Date - Oct 04 , 2024 | 11:51 AM