Chaitu Jonnalagadda: మల్టీటాలెంట్‌ బయటికి తీస్తోన్న నటుడు.. మ్యాటర్ ఏంటంటే

ABN , Publish Date - Oct 20 , 2024 | 04:46 PM

‘బబుల్‌‌గమ్‌, భామాకలాపం’ వంటి చిత్రాలలో మంచి రోల్స్‌లో నటించిన చైతూ జొన్నలగడ్డ టాలీవుడ్ ఆడియెన్స్‌‌తో మరి మంచి నటుడు టాలీవుడ్‌కి దొరికాడనే గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు చైతూ తనలోని మల్టీటాలెంట్‌ను చూపించేందుకు రెడీ అవుతున్నారు. అదేంటని అనుకుంటున్నారా..

Chaitu Jonnalagadda

సినిమాలలో అవకాశం రావాలని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు.. కొంత మంది కాస్త నేమ్, ఫేమ్ వచ్చాక వరుస ప్రాజెక్ట్‌లతో తామేంటో చూపించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ ప్రాసెస్‌లో ఏది పడితే అది చేస్తూ.. కొందరు తొందరగానే ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. మరికొందరు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే సూత్రం పాటిస్తుంటారు. కానీ కొంత మంది మాత్రం తనకు నచ్చిన కథలు, మెచ్చిన పాత్రలనే చేసుకుంటూ క్వాలిటీ కోసం పరితపిస్తుంటారు. అలాంటి వారిలో నేనూ ఒకడినని అంటున్నారు చైతూ జొన్నలగడ్డ (Chaitu Jonnalagadda). నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతూ జొన్నలగడ్డ.. అటు సినిమాలతోనూ, ఇటు వెబ్ సిరీస్‌లతోనూ బిజీ నటుడిగా కొనసాగుతున్నారు.

Also Read- Salman Khan: రావాలి అనిపించడం లేదు.. ఫ్రస్ట్రేషన్‌లో సల్మాన్ ఏమన్నాడో తెలుసా

‘బబుల్‌‌గమ్‌ (Bubblegum), భామాకలాపం’ వంటి చిత్రాలలో మంచి రోల్స్‌లో నటించిన చైతూ జొన్నలగడ్డ టాలీవుడ్ ఆడియెన్స్‌‌తో మరి మంచి నటుడు టాలీవుడ్‌కి దొరికాడనే గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు చైతూ తనలోని మల్టీటాలెంట్‌ను చూపించేందుకు రెడీ అవుతున్నారు. MM2 అంటూ తనలోని రైటర్, యాక్టర్‌ను పరిచయం చేయబోతున్నాడు. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టుల్ని కూడా ఆయన లైన్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. (Chaitu Jonnalagadda MM2 Movie)


Jonnalagadda.jpg

తన వద్దకు వచ్చిన పాత్రలలో ఏది పడితే అది చేసేయకుండా.. తనకు నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు చైతూ. ఈ క్రమంలో చైతూ జొన్నలగడ్డ ఓ మూడు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుబోతన్న ‘హిట్ 3’లో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈటీవీ విన్‌లో ఓ ప్రాజెక్ట్, పవన్ సాధినేనితో మరో సినిమాను చేస్తున్న చైతూ జొన్నలగడ్డ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో MM2 స్టార్ట్ చేయబోతున్నారు. ఈ MM2 ప్రాజెక్ట్ వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

Also Read- Ani Master: జానీ నిరపరాధి అని తేలితే ఏం చేస్తారు..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 20 , 2024 | 04:46 PM