Daksha Nagarkar: నాకొచ్చిన ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు.
ABN , Publish Date - May 06 , 2024 | 04:55 PM
తేజ దర్శకత్వంలో 'హోరాహోరి’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది దక్ష నగార్కర్. తదుపరి హుషారు, జాంబి రెడ్డి, రావణాసుర చిత్రాలతో అంతో ఇంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ బంగార్రాజు సినిమాలో ఓ పాటలో అలా వచ్చి ఇలా వెళ్లి పోయింది.
తేజ దర్శకత్వంలో 'హోరాహోరి’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది దక్ష నగార్కర్ (Actress Daksha Nagarkar). తదుపరి హుషారు, జాంబి రెడ్డి, రావణాసుర చిత్రాలతో అంతో ఇంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ బంగార్రాజు సినిమాలో ఓ పాటలో అలా వచ్చి ఇలా వెళ్లి పోయింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొమ్మిదేళ్లు అవుతున్నా చేసింది ఐదు చిత్రాలే. ఇప్పుడు అవకాశాలు లేకపోయినా టాలీవుడ్‌ని విడిచిపెట్టలేదు. అప్పుడప్పుడూ ఏదో ఒక ఈవెంట్లో మెరుస్తూనే ఉంటుందీ బ్యూటీ. తాజాగా ఆమె ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. (Daksha Nagarkar hospitalized)
‘గడిచిన కొద్ది రోజులు నాకెంతో క్లిష్టమైనవి.. ఎవరో తెలియని వ్యక్తుల మధ్య సర్జరీ గదిలో పడి ఉండటం కష్టంగా ఉంది. ఇప్పటికే వెన్నెముకకు రెండుసార్లు మత్తు మందు(అనస్థీషియా) సూదులు గుచ్చారు. దాన్నుంచి కోలుకోవడం కష్టంగా ఉంది. నా ఎమోషన్స్‌ను అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు అండగా నిలబడ్డారు. ఇలాంటి సమయంలో ఎలా ప్రేమించాలో చూపించారు. ప్రేమ, కేరింగ్‌కు కనిపించని గాయాలను నయం చేేస శక్తి ఉంది. నాకొచ్చిన ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు. మీ ఆరోగ్యంపై మీరు శ్రద్థ వహించండి. నా గురించి సంతోషకరమైన విషయాలనే పోస్ట్ చేస్తున్నాను.. ఎందుకంటే మీరు బాధపడకూడదు కాబట్టి!’ అని రాసుకొచ్చింది. తనకు ఏ సర్జరీ అయిందన్నది మాత్రం చెప్పలేదు.