Game Changer: ‘గేమ్ చేంజ‌ర్‌’.. జాబిల‌మ్మ లుక్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:07 AM

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. తాజాగా హీరోయిన్ కియారా అద్వాని లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

Kiara Advani

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) హీరోగా, డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’ (Game Changer). శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ (Sri Venkateswara Creations) బ్యాన‌ర్‌పై నిర్మాత‌లు దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Sirish) ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) న‌టిస్తోన్న సినిమా అవ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇప్ప‌టికే సినిమా నుంచి విడుద‌ల చేసిన జ‌ర‌గండి అనే పాట‌ను మంచి హైప్‌ను తీసుకువ‌చ్చాయి. తాజాగా బుధ‌వారం (జూలై 31) చిత్ర హీరోయిన్ కియారా అద్వాని (Kiara Advani) పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ‘గేమ్ చేంజ‌ర్‌’ (Game Changer) సినిమా నుంచి కియారా అద్వాని లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేస్తూ మా జాబిల‌మ్మ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ పోస్ట‌ర్‌ విడుద‌ల చేశారు.


Kiara Advani

ఇదిలాఉండ‌గా ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా డిసెంబ‌ర్‌లో ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు జిగ‌ర్తాండ పేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ (Karthik Subbaraj) ఈ సినిమాకు క‌థ అందించ‌డం విశేషం.

రామ్‌చ‌ర‌ణ్‌ (Ram Charan)కు జోడీగా అంజ‌లి (Anjali), కియారా (Kiara Advani) జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్ (Srikanth), జ‌య‌రాం (Jayaram), సునీల్ (Sunil), ఎస్జే సూర్య (S. J. Suryah), స‌ముద్ర‌ఖ‌ని (Samuthira kani ), నాజ‌ర్ (Nassar) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మ‌న్ (Thaman S) సంగీతం అందిస్తున్నాడు.

Updated Date - Jul 31 , 2024 | 11:15 AM