Malavika Mohanan: టాలీవుడ్ ఎంట్రీనే ప్రధానం.. ప్రభాసే కాపాడాలి
ABN , Publish Date - Nov 03 , 2024 | 09:30 AM
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలన్న సుదీర్ఘ కల ఇప్పటికి నెరవేరిందని హీరోయిన్ మాళవికా అన్నారు. ఈ ఎంట్రీ కూడా ఎంతో గ్రాండ్‌గా ఉందని పేర్కొంది.
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలన్న సుదీర్ఘ కల ఇప్పటికి నెరవేరిందని హీరోయిన్ మాళవికా మోహనన్ (Malavika Mohanan) అన్నారు. ఈ ఎంట్రీ కూడా ఎంతో గ్రాండ్‌గా ఉందని పేర్కొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ (K. U. Mohanan) కుమార్తెగా 2013లో తన మొదటి సినిమానే దుల్కర్ సల్యాన్ వంటి స్టార్‌తో నటించి వార్తల్లో నిలిచింది. ఆపై రజనీకాంత్ (Rajinikanth) పేట (Petta) చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ ఆ తర్వాత విజయ్‌తో మాస్టర్ (Master), ధనుష్‌తో మారన్ (Maaran), విక్రమ్‌తో తంగలాన్ వంటి హీరోల సరసన నటించి ఆగ్ర కథానాయిక గుర్తింపును తెచ్చుకుంది.
ఆ చిత్రాలన్నీ మంచి విజయం సాధించినప్పటికీ అందులో ఏ ఒక్క చిత్రం కూడా ఆమెకు సరైన బ్రేక్ ఇవ్వలేదు. అదే సమయంలో సినీ అవకాశాలు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లోకి అడుగుపెట్టేందుకు మాళవిక (Malavika Mohanan) చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ మూవీలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది.
దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘సరైన చిత్రం ద్వారా తెలుగులోకి అడుగుపెట్టాలన్న నా చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ‘బిగ్‌బాస్’ అవకాశం లభించినప్పటికీ ఈ ఆఫర్ కంటే టాలీవుడ్లో ఎంట్రీనే నాకు ప్రధానం. ఇంతకంటే గొప్ప డెబ్యూ నాకు లభించదు. ఈ మూవీ కోసం అభిమానుల తరహాలోనే నేను కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొంది.
ఇదిలాఉండగా ఈ అమ్మడు ఈ ఏడాది విక్రమ్ హీరోగా వచ్చిన తంగలాన్ సినిమాలో ఆరతి క్యారెక్టర్‌తో మంచి గర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా సిద్థాంత్ చతుర్వేది సరసన యుద్ర (Yudhra) అనే హిందీ సినిమాలో కాస్త బోల్డ్‌గా నటించి బాలీవుడ్‌లోనూ తన అదృష్టం పరీక్షించుకున్నా ఫలితం దక్కలేదు. దీతో ఈ ముద్దగుమ్మ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఆశలన్నీ ఇప్పుడు టాలీవుడ్, ప్రభాస్ రాజా సాబ్, కార్తి సర్దార్ 2 సినిమాలపైనే ఉన్నాయి.