హనుమాన్, కల్కి.. ఇప్పుడు ‘రహస్యం ఇదం జగత్’! తెలుగులో మరో ఇంట్రెస్టింగ్ చిత్రం
ABN , Publish Date - Aug 11 , 2024 | 01:47 PM
కొత్తదనంతో కూడిన చిత్రాలను, వైవిధ్యమైన కథలను మన ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. పురాణాలు, ఇతిహాసాల గురించి ఏదైనా అంశంతో రూపొందిన చిత్రమంటే ఎంతో ఆసక్తితో చూస్తారు. సరిగ్గా అలాంటి జానర్‌లోనే ఓ చిత్రం రాబోతుంది.
కొత్తదనంతో కూడిన చిత్రాలను, వైవిధ్యమైన కథలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇక వాళ్లతో ఆసక్తిని కలిగించే సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్ అంటే.. అందునా మన పురాణాలు, ఇతిహాసాల గురించి ఏదైనా అంశంతో రూపొందిన చిత్రమంటే ఎంతో ఆసక్తితో చూస్తారు. సరిగ్గా అలాంటి జానర్‌లోనే రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్ (RAHASYAM IDHAM JAGATH).
రాకేష్ గలేబి (Rakesh Galebhe), స్రవంతి పత్తిపాటి (Sravanthi Prattipati), మాసస వీణ (Manasa Veena), భార్గవ్ గోపీనాథం (Bhargav Gopinatham), కార్తీక్ కండాల (Karteek Kandala), శివకుమార్ జుటూరి, ఆది నాయుడు, లాస్య రావినూతుల ముఖ్యపాత్రల్లో నటించారు. సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ (Komal RBharadwaj) దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డేట్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
నవంబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా ఈ గ్లింప్స్‌లో ప్రకటించారు. కాగా ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే.. మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని ఈ చిత్రం రూపొందించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మన శ్రీచక్రం గురించి చెబుతున్న పాయింట్ అందరికి గూజ్‌బంప్స్ తీసుకొచ్చే విధంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. ఈ చిత్రానికి గ్యానీ సంగీతం అందిస్తుండగా రవితేజ నిట్ట రచన చేశారు. రాకేష్ గలేబి, కోమల్ రావినూతుల సహ నిర్మాతలు.