Akkineni Nageswararao: నటుడు రచయితగా మారిన వేళ 

ABN , Publish Date - Sep 20 , 2024 | 10:38 AM

సినీజీవితంలో తీరికలేని జీవితం గడిపిన అక్కినేని జీవితాన్ని రాయదలిస్తే ఎన్ని పేజీలైనా సరిపోవు. తన అనుభవాలు, ఆలోచనలకు అప్పుడప్పుడు అక్షరరూపం ఇస్తూ వచ్చారు

సినీజీవితంలో తీరికలేని జీవితం గడిపిన అక్కినేని ANR liveson) జీవితాన్ని రాయదలిస్తే ఎన్ని పేజీలైనా సరిపోవు. తన అనుభవాలు, ఆలోచనలకు అప్పుడప్పుడు అక్షరరూపం ఇస్తూ వచ్చారు అక్కినేని(ANR). నటుడు రచయితగా మారిన వేళ పుట్టుకొచ్చిన పుస్తకాలే ఇవి.. (Anr Book)

నేను చూసిన అమెరికా :
1964లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై ఆ దేశంలో అరవై రోజులు పర్యటించారు ఏఎన్‌ఆర్‌. పర్యటన విశేషాలతో ఈ పుస్తకాన్ని రాశారు. 1965 జనవరి 1న విజయవాడకు చెందిన జ్యోతిబుక్స్‌ దీన్ని విడుదల చేసింది.

నేనూ నా జీవితం :
అక్కినేని తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆలోచనలతో ఒక పుస్తకం రాశారు. అక్కినేని చలనచిత్ర జీవిత రజతోత్సవ సన్మాన సభ 1970 జనవరి 26న జరిగింది. ఈ సందర్భంగా పుస్తకాన్ని సావిత్రి ఆవిష్కరించారు. ఈ కథనాలన్నీ మొదట్లో ధారావాహికంగా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితం అయ్యాయి.

ANr-amana.jpg

అ.ఆ.లు (అక్కినేని ఆలోచనలు) :
అక్కినేని అప్పుడప్పుడు తనకు వచ్చిన, నచ్చిన ఆలోచనలను చిన్ని చిన్ని పద్యాలుగా రాసి వాటికి అ.ఆ.లు అనే పేరు పెట్టారు. ఈ పుస్తకాన్ని చలనచిత్ర రజతోత్సవ సభ (1970 జనవరి 26) సందర్భంగా పాత్రికేయులకు అంకితం ఇవ్వడం విశేషం.

వందనం అభివందనం :
అప్పట్లో విజయచిత్ర సినిమా మాసపత్రికలో తనకు అవకాశం ఇచ్చిన దర్శకుల గురించి రాశారు అక్కినేని. ఈ వ్యాసాలన్నింటినీ కలిపి పుస్తకంగా తీసుకొచ్చారు. తన 72వ జన్మదినోత్సవం సందర్భంగా 2005 సెప్టెంబరు 20న జూబ్లీహాల్‌లో ఆవిష్కరించారు.

మనసులోని మాట :
ఒక టీవీ ఛానల్‌లో వారం వారం ప్రసారం అయిన మనసులోని మాటలకు అక్షర రూపమే ఈ గ్రంథం. రచయిత రావికొండలరావు రచనా సహకారంతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. దీనిని అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ముద్రించింది.

Updated Date - Sep 20 , 2024 | 05:10 PM