Allu Arjun: బన్నీపై రేపు విచారణ.. ఆలా ఎలా అయింది అంటే

ABN , Publish Date - Oct 21 , 2024 | 02:19 PM

2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో బన్నీ తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ గా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నంద్యాలలో బన్నీ ఎన్నికలు కోడ్ ఉల్లంఘించాడు అంటూ కేసు నమోదైంది. దీనిపై రేపు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఇంతకీ ఏమైందంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండటంతో షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. అయితే 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో బన్నీ తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ గా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నంద్యాలలో బన్నీ ఎన్నికలు కోడ్ ఉల్లంఘించాడు అంటూ కేసు నమోదైంది. దీనిపై రేపు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఇంతకీ ఏమైందంటే..


2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో బన్నీ వైసీపీ అభ్యర్థికి మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యాన్స్, జన సైనికులు సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్ చేశారు. అలాగే మెగా బ్రదర్ నాగ బాబు కూడా బన్నీపై పరోక్ష విమర్శలు చేశాడు. సాయి ధరమ్ తేజ్ కూడా బన్నీని సోషల్ మీడియా ఖాతాల్లో ఆన్ ఫాలో చేసినట్లు కథనాలు వచ్చాయి. ఇదంతా పక్కనపెడితే బన్నీ ప్రచార సమయంలో సెక్షన్ 144, పోలీసు యాక్టు 30 అమల్లో ఉండగా పర్మిషన్ లేకుండా జనసమీకరణ చేశారంటూ కేసు నమోదైంది. దీనిపై రేపు (మంగళవారం) విచారణ జరపనుంది.


మరోవైపు ఎన్నికల సమయంలో తన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసి.. శిల్పా రవి ఇంటికి వెళ్లి మరీ విష్ చేయడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మెగా, అల్లు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. దీంతో ఇప్పుడు నంద్యాల విషయంపై బన్నీ'ఆహా' 'అన్‌స్టాపబుల్‌’ సీజన్ 4' లో బాలయ్యతో క్లారిటీ ఇచ్చేలా అల్లు అరవింద్ ప్లాన్ చేశాడు.

Updated Date - Oct 21 , 2024 | 02:19 PM