Allu Arjun: బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇది.. 1600 కిమీలు సైకిల్ పై
ABN , Publish Date - Oct 16 , 2024 | 04:52 PM
పుష్ప రిలీజైన తర్వాత ఆయన క్రేజ్ హిందీలో బెల్ట్‌లో పీక్‌కి చేరింది. అక్కడ ఎవరినీ కదిలించిన పుష్ప ఫ్యానే. తాజాగా ఒక నార్త్ అభిమాని బన్నీ కోసం చేసిన ఫీట్ చూస్తే తప్పకుండ షాక్ అవుతారు. ఇంతకీ ఏమైందంటే..
తెలుగు రాష్ట్రాలల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌కి దరిదాపుల్లో కూడా ఏ తెలుగు హీరో లేకపోవడం ఇందుకు నిదర్శనం. స్కూల్ పిల్లల నుంచి ముసలి ముతక వరకు అందరు పుష్ప రాజ్ ఫ్యాన్సే. టాలీవుడ్‌తో పాటు మాలీవుడ్‌లో ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుష్ప (Pushpa) రిలీజైన తర్వాత ఆయన క్రేజ్ హిందీలో బెల్ట్‌లో పీక్‌కి చేరింది. అక్కడ ఎవరినీ కదిలించిన పుష్ప ఫ్యానే. తాజాగా ఒక నార్త్ అభిమాని బన్నీ కోసం చేసిన ఫీట్ చూస్తే తప్పకుండ షాక్ అవుతారు. ఇంతకీ ఏమైందంటే..
పుష్ప సినిమా రిలీజైన తర్వాత నార్త్‌లో బన్నీ ఫాలోయింగ్ మామూలుగా పెరగలేదు. ఇప్పటి వరకు వాళ్ళు చూడని మాస్ యాక్షన్ ఫీట్స్ అల్లు అర్జున్ పుష్పలో చూశారు. ఒక రకంగా ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కంటే ఎక్కువగా నార్త్ ఆడియెన్స్ పుష్ప 2 కోసం ఎక్కువగా వేచి చుస్తునారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే.. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక అభిమాని 1600 కిలో మీటర్లు సైకిల్ మీద ట్రావెల్ చేసి బన్నీని కలవడానికి వచ్చాడు. ఎట్టకేలకు బన్నీని కలిసిన ఆ వ్యక్తి.. ఎమోషనల్‌గా బన్నీకి హగ్ ఇచ్చాడు. సైకిల్‌పై అంతా దూరం నుంచి వచ్చాడని తెలియడంతో బన్నీ షాక్ అయ్యాడు. మళ్ళీ సైకిల్‌పై వెళ్లోద్దని ఫ్లైట్ టికెట్ బుక్ చేయించాడు. ఆ సైకిల్‌ని బస్ లో పంపించాలని ఆదేశించాడు. అలాగే ఆ వ్యక్తి దారి ఖర్చులకి డబ్బులు ఇచ్చి పంపాడు. ఒకవేళ పుష్ప ప్రమోషన్స్‌లో నార్త్‌కి వస్తే తనని తప్పకుండ కలుస్తానని మాట ఇచ్చాడు.