Allu Arjun: అల్లు అర్జున్‌ని మార్చేసిన వెపన్ ఏంటో తెలుసా..
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:01 PM
సినిమాల విషయంలో 'మీరు పుష్ప 3 చేయండి’, నేను అఖండ 3 చేస్తాను’ అని బన్నీ, బాలయ్యతో అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ‘పుష్ప’ మేనరిజమ్‌తో నడుస్తూ ‘తగ్గేదే లే’ అని చేసి చూపించారు.
ఉత్తమ నటుడిగా జాతీయ (National Award) పురస్కారం రావడంపై అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి స్పందించారు. ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ సీజన్ 4’ (Unstoppable 4) ఎపిసోడ్‌లో ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ "ఓసారి వెనక్కి వెళ్లి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ ఎవరికి వచ్చిందని చెక్ చేస్తే.. ఒక్క తెలుగు పేరు కూడా లేదు. అది నా మనసులో బాగా ఉండిపోయింది. దాన్ని రౌండప్ చేసి ఎలాగైనా కొట్టాలి.. దీన్ని కొట్టాలి’ అని ఫిక్సయ్యాను ఇప్పుడు దక్కింది’’ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
సినిమాల విషయంలో 'మీరు పుష్ప 3 చేయండి’, నేను అఖండ 3 చేస్తాను’ అని బన్నీ, బాలయ్యతో అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ‘పుష్ప’ మేనరిజమ్‌తో నడుస్తూ ‘తగ్గేదే లే’ అని చేసి చూపించారు. ప్రస్తుతం అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.
అలాగే చిరంజీవి, మహేశ్‌బాబుల గురించి మాట్లాడారు. యాక్షన్ ఇష్టమా? రొమాన్స్ ఇష్టమా? అని బాలయ్య అడగ్గా.. తొక్కలో యాక్షన్ సర్ అని నవ్వుతూ మనసులో మాట బయటపెట్టాడు. ఈ షోలో సర్‌ప్రైజ్‌గా బన్నీ తల్లి అల్లు నిర్మల కూడా వచ్చారు. చిన్నప్పుడు ఎప్పుడైనా కొట్టారా? అని బాలకృష్ణ అడిగితే "ఒక్కటా, దేనితో కొట్టలేదో అడగండి.. అన్ని వెపన్స్ ఉపయోగించారు. అందుకే ఇలా సినిమాలు చేస్తున్నాం" అని తాను చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి ఫన్నీగా చెప్పారు.
ఏ వెపన్ వల్ల నువ్వు మారావ్ అనుకోవచ్చు అని బాలకృష్ణ అడగ్గా.. స్నేహారెడ్డి అనే వెపన్ వల్ల మారానని సెటైరికల్‌గా చెప్పుకొచ్చారు. ఏ విషయంలో కోపం వస్తుంటుంది అని అడగ్గా.. బయటకు చెప్పకపోవచ్చు, కానీ అమ్మాయిలకు ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం కోపం వచ్చేస్తూ ఉంటుందని అల్లు అర్జున్ అన్నారు.