Allu Arjun: ఈ బ్రాండ్ ఇక నుండి.. అసలు 'తగ్గేదేలే'
ABN , Publish Date - Nov 07 , 2024 | 01:12 PM
తాజాగా 'థమ్స్ అప్'కి కొత్త అంబాసిడర్ వచ్చారు ఇదిగో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లే సాక్ష్యం అంటూ కొందరు చూపిస్తున్నారు. ఆ పోస్ట్‌లలో వాస్తవం ఉన్న అసలు ఆంతర్యం చాలామంది అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ పోస్ట్‌లలో ఏముంది. మన 'పుష్ప రాజ్' అల్లు అర్జున్‌కి దీనికి ఉన్న సంబంధం ఏంటంటే..
ఇంటర్నేషల్ సాఫ్ట్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూటర్ 'కోకా కోలా' దేశీయ ప్రోడక్ట్ 'థమ్స్ అప్'. దేశ విదేశాలలో మంచి ఆదరణ పొందిన ఈ డ్రింక్‌కి ప్రస్తుతం బాలీవుడ్ 'బాద్ షా' షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. 2022లో ఈ కాంట్రాక్ట్‌ని సైన్ చేసిన షారుఖ్‌ని వదులుకోవడానికి 'థమ్స్ అప్' అసలు ఇష్టపడటం లేదు. అయితే తాజాగా 'థమ్స్ అప్'కి కొత్త అంబాసిడర్ వచ్చారు ఇదిగో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లే సాక్ష్యం అంటూ కొందరు చూపిస్తున్నారు. ఆ పోస్ట్‌లలో వాస్తవం ఉన్న అసలు ఆంతర్యం చాలామంది అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ పోస్ట్‌లలో ఏముంది. మన 'పుష్ప రాజ్' అల్లు అర్జున్‌కి దీనికి ఉన్న సంబంధం ఏంటంటే..
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ కానుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే థమ్స్ అప్.. పుష్ప టీమ్‌తో యాడ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయనుంది. దీనికి సంబంధించిన పోస్ట్‌లను కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసింది. ఇందులో అల్లు అర్జున్ ఫుల్ స్వాగ్‌తో 'పుష్ప 2' డైలాగ్స్ అండ్ మేనరిజమ్స్‌తో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Also Read-Janhvi Kapoor: హైదరాబాద్‌లోని ఆంజనేయస్వామి గుడిలో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు
అయితే ఇప్పటివరకు రౌడీ బాయ్ 'విజయ్ దేవరకొండ' ఈ యాడ్ క్యాంపెయిన్‌లో ఎక్కువగా కనిపించడంతో కొందరు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ అని భావిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ క్యాంపెయిన్‌లో జాయిన్ కావడంతో బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ అవుట్, అల్లు అర్జున్ ఇన్ అంటూ కొన్ని న్యూస్ సర్క్యూట్ అవుతున్నాయి. అయితే 'థమ్స్ అప్' బ్రాండ్ అంబాసిడర్ ఒక్కరే.. ఆయనే షారుఖ్. షారుఖ్‌తో పాటు యాడ్స్‌లో కనిపించే అక్షయ్ కుమార్, J.D. చక్రవర్తి, సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, చిరంజీవి, మహేష్ బాబు, విశాల్ రెడ్డి, విజయ్ దేవరకొండ, జస్ప్రీత్ బుమ్రా, కిచ్చా సుదీప్ కేవలం టెంపరరీ క్యాంపెయినర్స్ మాత్రమే. సో, బన్నీ కూడా అంతే.