Venky Anil3: 'యానిమల్’ నటుడిని పట్టేశారు!
ABN , Publish Date - Jul 11 , 2024 | 04:31 PM
విక్టరీ వెంకటేశ్(Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో మూడో చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే! వెంకీ నటిస్తున్న 76వ సినిమా. 'ఎఫ్2' సిరీస్ చిత్రాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న చిత్రమిది.
విక్టరీ వెంకటేశ్(Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో మూడో చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే! వెంకీ నటిస్తున్న 76వ సినిమా. 'ఎఫ్2' సిరీస్ చిత్రాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న చిత్రమిది. అయితే, ఈసారి కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. సీరియస్ యాక్షన్ తో సినిమాను తెరకెక్కించనున్నారు. దిల్ రాజు (Dil raju) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. రామానాయుడు స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నాయికలు. ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీసుగా నటించనున్నారు. ఓ ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, ఎక్సెలెంట్ వైఫ్ ఈ ముగ్గురి మధ్య సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త హల్చల్ చేస్తోంది. గత ఏడాది విడుదలైన విజయం సాధించిన 'యానిమల్’ చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారు. అందులో మరాఠీ నటుడు ఉపేంద్ర లెమాయి ఫ్రెడ్డీ అనే పాత్రలో నటించాడు. స్వయంగా రణబీర్ కపూర్ సిద్థం చేసుకున్న ఒక గన్ డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన ఫ్రెడ్డీ 'వాట్ ఏ విజన్ వాట్ ఏ థాట్’ అనే డైలాగ్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. అతని ఫోటోతో అనేక మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్థమైంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా తెలిపారు. ఆయన పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని, ఆయన్ను పరిచయం చేసిన సందీప్ రెడ్డి వంగాకి థాంక్స్ చెబుతున్నాను’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.