ANR AWARDS: మెగాస్టార్‌కి కింగ్ ఇన్విటేషన్.. ఏఎన్నార్ అవార్డ్స్
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:38 AM
ప్రతియేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించే ఏఎన్నార్ జాతీయ అవార్డు (ANR NATIONAL AWARD) ని ఈ నెల (అక్టోబర్) 28న ప్రధానం చేయనున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని ఈ ఏడాది ఎవరు అందుకొన్నారు.. ఎవరు ప్రధానం చేయనున్నారంటే..
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు (Akkineni Nageswara Rao) శత జయంతిని అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహిస్తోంది. 1923 సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వర్ రావు జన్మించారు. సెప్టెంబర్ 20, 2024 నాటికీ శత జయంతి కావడంతో అక్కినేని ఫ్యామిలీ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఏఎన్నార్ సినిమాలని ప్రదర్శించి ఘనమైన నివాళ్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ప్రతియేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించే ఏఎన్నార్ జాతీయ అవార్డు (ANR NATIONAL AWARD) ని ఈ నెల (అక్టోబర్) 28న ప్రధానం చేయనున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని ఈ ఏడాది ఎవరు అందుకొన్నారు.. ఎవరు ప్రధానం చేయనున్నారంటే..
ప్రతి ఏడాది అక్కినేని నాగేశ్వర్ రావు జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని అక్కినేని కుటుంబం ఏఎన్నార్ జాతీయ అవార్డును ప్రకటించే విషయం తెలిసిందే. 2006లో అక్కినేని 83వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆనవాయితీ ప్రారంభం అయ్యింది. ఇప్పటి వారికి దేశంలోని వివిధ భాషలకు సంబంధించి ప్రతిభావంతులైన లెజెండ్స్ ఈ అవార్డును అందుకున్నారు. కాగా ఈ ఏడాది అక్కినేని శత జయంతి వేడుకల్లో నాగార్జున మాట్లాడుతూ.. ఈ సారి అవార్డును మెగాస్టార్ చిరంజీవికి అందించనున్నట్లు ప్రకటించాడు. ఈ అవార్డును ప్రధానం చేసేందుకు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ రానున్నట్లు తెలిపారు. తాజాగా నాగ్.. చిరంజీవిని మర్యాదగా కలిసి ఆహ్వానించాడు. బిగ్ బీ అమితాబ్‌ని కూడా త్వరలోనే మర్యాదగా కలిసి ఆహ్వానించనున్నారు.
ఇప్పటి వరకు ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును అందుకున్నది వీరే..
2019: రేఖ
2018: శ్రీదేవి
2017: S S రాజమౌళి
2016: గుడిపూడి శ్రీహరి
2014: అమితాబ్ బచ్చన్
2012: శ్యామ్ బెనగల్
2011: హేమ మాలిని
2010: కె. బాలచందర్
2009: లతా మంగేష్కర్
2008: వైజయంతిమాల
2007: అంజలీ దేవి & జయసుధ
2006: షబానా అజ్మీ
2006: దేవ్ ఆనంద్