Anupama Paramesaran: ఇప్పుడు పరిణితి చెందాను... అందుకే ఇలా!
ABN , Publish Date - Apr 07 , 2024 | 12:11 PM
కెరీర్ బిగినింగ్ నుంచి మల్లూ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఎలాంటి పాత్రలతో మెప్పించిందో తెలిసిందే! పక్కింటి అమ్మాయి పాత్రలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా తన రూట్ మార్చింది.
కెరీర్ బిగినింగ్ నుంచి మల్లూ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఎలాంటి పాత్రలతో మెప్పించిందో తెలిసిందే! పక్కింటి అమ్మాయి పాత్రలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా తన రూట్ మార్చింది. గ్లామర్ సీన్స్ చేయడానికి సై అంటోంది. ఇప్పటికే చేసి చూపించింది కూడా. ఇటీవల విడుదలై సక్సెస్ బాటలో ఉన్న 'టిల్లు స్వ్కేర్' (Tillu square) చిత్రంలో లిప్‌లాక్, అందాల ఆరబోత అంటూ గ్లామర్‌కు గేట్లు ఎత్తేసింది. అయితే ఆమెను అభిమానించేవాళ్లు.. తనని సాంప్రదాయ పాత్రల్లోనే చూడాలనుకునేవారు మాత్రం కాస్త నొచ్చుకున్నారు. దీంతో నటి అనుపమ పరమేశ్వరన్‌నే ఇలా నటించింది? అని చాలా మంది ఆశ్చరపడుతున్నారు. కొందరైతే అసలెందుకు ఇలా స్కిన షో క్యారెక్టర్ చేసిందని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతానికి ఈ విషయం విపరీతంగా వైరల్ అవుతోంది. గ్లామర్‌గా నటించడంపై వస్తున్న విమర్శలపై ఇప్పటికే ఘాటుగా స్పందించింది. తాజాగా మరోసారి స్పందించింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో లిప్‌లాక్ సన్నివేశంలో నటించడాన్ని ఏదో పెద్ద తప్పు చేసినట్లు విమర్శిస్తున్నారని మండిపడింది.
Ruhani Sharma: ఆ బంధం గురించి చెప్పాలని లేదు.. పూర్తిగా నా వ్యక్తిగత విషయం
"నేను 18 ఏళ్ల వయసులో ముద్దు సన్నివేశాలు, గ్లామరస్‌గా కనిపించడానికి నో అన్నాను. ఇప్పుడు కాదు. నటిగా నేనిప్పుడు పరిణితి చెందాను. కథకు అవసరం అయితే లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించడం తప్పేం కాదు. అంతే కాదు రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది. అందుకే కొత్తగా ట్రై చేశా. టిల్లు స్వ్కేర్ చూసి ప్రశంసించడమో, విమర్శించడమో చేయవచ్చు గానీ, చిత్రం చూడకుండానే విమర్శించడం కరెక్ట్ కాదు’’ అని అనుపమ పరమేశ్వరన్ ఫైర్ అయ్యారు.