Devaki Nandana Vasudeva: ’మట్కా, కంగువా’లతో.. సై అంటున్న మహేశ్ మేనల్లుడు
ABN , Publish Date - Oct 06 , 2024 | 06:03 PM
రెండేండ్ల క్రితం హీరో వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా రూపొందిన కొత్త చిత్రం ’దేవకి నందన వాసుదేవ’ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు.
రెండేండ్ల క్రితం హీరో వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) కథానాయకుడిగా రూపొందిన కొత్త చిత్రం ’దేవకి నందన వాసుదేవ’(Devaki Nandana Vasudeva). గుణ 369తో మంచి విజయం దక్కించుకున్న అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) ఈ మూవీకి దర్శకత్వం వహించగా నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. తాజాగా ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. నవంబర్ 14న గురు పూర్ణిమకు ముందు రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మాత బాలక్రిష్ణ మాట్లాడుతూ.. మా సినిమా టైంలో మట్కా, కంగువా సినిమాలు రిలీజులున్నాయి. అవి వచ్చినా సరే మా సినిమా మాదే. మాది సక్సెస్ అవుతుందనే నమ్ముతున్నాను. మేం కొత్తవాళ్లమే అయిన మంచి ఔట్ పుట్ తో మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాం. థియేటర్‌లో సినిమా చూశాక మంచి సినిమా తీశామనే ఫీలింగ్ మీకూ కలుగుతుంది. ఇక ప్రశాంత్ వర్మ కథ గురించి తెలిసిందే. సరికొత్త ఐడియాతో ఆయన రాశారు. సంగీత దర్శకుడు భీమ్స్ ఆకట్టుకునేలా మంచి బాణీలు ఇచ్చారు. సాయిమాధవ్ పదునైన మాటలు రాశారు. దర్శకుడు ఫర్ ఫెక్ట్ గా సినిమాను రూపొందించారు. నవంబర్ 14న సినిమా విడుదల కాబోతుంది అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.
దర్శకుడు అర్జున్ (Arjun Jandyala) మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఇచ్చిన కథ యూనిక్ స్టయిల్ లో ఉంది. కథ ఇచ్చాక సోల్ దెబ్బతినకుండా మీకు నచ్చిన రీతిలో చేయమని అన్నారు. పక్కా కమర్షియల్ అంశాలతో సినిమాగా తీశాం. ఇంతకు పూర్వం ఇలాంటి కథ రాలేదు. మురారి సినిమాతో భీమ్స్ పోల్చారు. అంతకుమించిందిగా ఉంటుందని చెప్పగలను. రసూల్ కెమెరా, ఫైట్స్ సినిమాకు ఆకర్షణ అశోక్ టాప్ రేంజ్ హీరోలా చేశాడు. ఆదిపురుష్ లో నటించిన దేవదత్త నాగ్ కూడా బాగా నటించారు. మానస చాలా సహకరించి సినిమా బాగా వచ్చేలా నటించింది. మొదటినుంచి హిట్ సినిమా చేయాలని పట్టుదలతో తీశామన్నారు.
హీరో అశోక్ గల్లా (Ashok Galla)మాట్లాడుతూ.. ఇది నాకు రెండో సినిమా. ముందుగా ప్రశాంత్ వర్మకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కథ అంటే ఆడియన్ కు ఏదో గట్టి కథ ఉంటుందని గ్రహించేస్తారు. ఈ కథలో సోల్ చాలా డెప్త్ గా ఉంటుంది. ఇంత కమర్షియల్ సినిమాను దర్శకుడు అద్భుతంగా తీశారు. ఇక మానసకు చాలెంజింగ్ రోల్. ఈ సినిమా తర్వాత ఆమె స్థాయి పెరుగుతుంది. నవంబర్ 14న సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు. కథానాయిక మానస (Manasa Varanasi) మాట్లాడుతూ, గత ఏడాది ఈ సినిమాతో నా జర్నీ మొదలైంది. నా మొదటి సినిమాలో సీనియర్స్ తో నటించడం వల్ల చాలా నేర్చుకున్నా. ఇందులో నా పాత్రపేరు సత్యభామ. తనకు ఎలాంటి ఒత్తిడి వున్నా ధైర్యంతో ముందుకుసాగే పాత్ర, అందరినీ అలరించేదిగా ఉంటుంది. కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందించారు.
ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌ను చూస్తే ఆధ్యాత్మిక అంశాలున్నాయని తేలింది. మొదటి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో రెగ్యులర్ అప్ డేట్స్ తో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అశోక్ గల్లా సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తుండగా, ఒక వైపు సాధువు, మరొక వైపు అంత శక్తివంతమైన గెటప్, బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చూడవచ్చు.