Ashu Reddy: నా బాడీ సూప‌ర్‌డీల‌క్స్ అంటున్న ఆషురెడ్డి

ABN , Publish Date - May 03 , 2024 | 03:32 PM

"రొటీన్‌ పాత్రలకు భిన్నంగా కొత్త పాత్రల్లో నటించినప్పుడే కెరీర్‌లో కిక్‌ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నాను’’ అని అంటోంది అషురెడ్డి. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం  'యేవమ్‌’. ఇందులో హారిక అనే పాత్రలో ఆమె బోల్డ్‌ అండ్‌ హాట్‌గా కనిపించనున్నారు.

Ashu Reddy: నా బాడీ సూప‌ర్‌డీల‌క్స్ అంటున్న ఆషురెడ్డి

"రొటీన్‌ పాత్రలకు భిన్నంగా కొత్త పాత్రల్లో నటించినప్పుడే కెరీర్‌లో కిక్‌ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నాను’’ అని అంటోంది అషురెడ్డి(Ashu Reddy). తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం  'యేవమ్‌’ (Yevam). ఇందులో హారిక అనే పాత్రలో ఆమె బోల్డ్‌ అండ్‌ హాట్‌గా కనిపించనున్నారు. 'నా బాడీ సూపర్‌డీలక్స్‌’ (naabody Super deluxe) అంటూ విడుదల చేసిన ఆషురెడ్డి పోస్టర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే 'యేవమ్‌’ చిత్రం చూడాలంటున్నారు దర్శకుడు. చాందిని చౌదరి, వశిష్ఠ సింహా, జైభారత్‌, ఆషురెడ్డి ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకుడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. 

శుక్రవారం ఆషు రెడ్డి పాత్రకు సంబంధించిన లుక్‌ విడుదల చేశారు. మేకర్స్‌ మహిళా సాధికారతను చాటి చెప్పే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఆయన మాట్లాడుతూ "ఇటీవల విడుదల చేసిన చాందిని  చౌదరి పోస్టర్‌లో వున్న ‘ఆడపిల్లలు అయితే ఏంటంటా? అనే రైటప్‌ అందర్ని ఆలోచింపజేసింది. ఇప్పుడు ఆషు రెడ్డి నా బాడీ సూపర్‌ డీలక్స్‌ అని ఎందుకు అంటుంది. ఇలా ప్రతి పాత్రకు ఒక మార్క్‌ ఉంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌గా నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. 

Jitender Reddy: 1980’s నిజంగా జ‌రిగిన రాజ‌కీయాల నేప‌థ్యంలో ‘జితేందర్ రెడ్డి’.. ట్రైల‌ర్‌కు అనూహ్య స్పందన


Read More: Tollywood, Cinema News

Updated Date - May 03 , 2024 | 03:33 PM