Anantha Sriram: అంతా.. ‘అనంత శ్రీరామ్’ మయం
ABN , Publish Date - Nov 02 , 2024 | 06:32 PM
చిన్న సినిమాగా వచ్చి బేబీ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. అయితే ఈ సినిమాలో పాటలు మరో ఎత్తు. ఈ క్రమంలోనే మ్యూజిక్ కేటగిరిలో ఏడాది ప్రకటించిన అన్ని ప్రతిష్టాత్మక ఉత్తమ అవార్డులను ప్రముఖ టెక్నీషియన్ కొల్లగొట్టారు. ఇంతకీ ఆ ప్రముఖ టెక్నీషియన్ ఎవరంటే..
చిన్న సినిమాగా వచ్చి బేబీ(Baby The Movie) సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టి ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరో హీరోయిన్లుగా హృదయ కాలేయం, కలర్‌ఫొటో చిత్రాలకు నిర్మాతగా కొబ్బరిమట్ట చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి రాజేశ్(Sai Rajesh) ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాలో పాటలు మరో ఎత్తు. ఈ క్రమంలోనే మ్యూజిక్ కేటగిరిలో ఏడాది ప్రకటించిన అన్ని ప్రతిష్టాత్మక ఉత్తమ అవార్డులను ప్రముఖ టెక్నీషియన్ కొల్లగొట్టారు. ఇంతకీ ఆ ప్రముఖ టెక్నీషియన్ ఎవరంటే..
Also Read-Deepika Padukone: కూతురు పేరు రివీల్ చేసిన దీపికా.. అబ్బా ఎంత మంచి పేరు
ఈ చిత్రానికి లిరిక్స్ అందించి అనంత శ్రీరామ్ బెస్ట్ లిరిక్ రైటర్‌గా ఐఫా అవార్డ్ దక్కించుకున్నారు. 'ఓ రెండు మేఘాలిలా..' పాటకు ఆయనకు ఐఫా అవార్డ్ సొంతమైంది. దీంతో బేబి సినిమాకు బెస్ట్ లిరిక్ రైటర్ గా అన్ని మేజర్ అవార్డ్స్ స్వీప్ చేశారు అనంత శ్రీరామ్. ఈ అవార్డ్ తీసుకున్న సందర్భంగా నిర్మాత ఎస్ కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్ తో కలిసి అనంత శ్రీరామ్ ఫొటో తీసుకున్నారు. ఎస్ కేఎన్, సాయి రాజేశ్ అనంత శ్రీరామ్ ను అభినందించారు. బేబి సినిమాకు ఇప్పటిదాకా ఫిలింఫేర్, సైమా, గామా వంటి అనేక గొప్ప పురస్కారాలు దక్కాయి. ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కుతున్నాయంటే ఆ ఘనత ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించిన డైరెక్టర్ సాయి రాజేష్‌కే దక్కుతుంది. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ కాంబినేషన్లో బాలీవుడ్లో బేబి సినిమా రీమేక్ అవుతోంది.
కాగా ఈ సినిమాకు హీరోగా ప్రముఖ బాలీవుడ్ హీరో బాబీ డియోల్ తనయుడు అర్యమాన్ను అనంద్ పాత్రకు తీసుకుంటున్నట్లు వార్తలు రాగా, కొత్త అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేయనున్నట్లు తెలస్తోంది. ఇదిలాఉండగా గతంలోనూ తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించిన కిక్, రెడీ, ఛత్రపతి, జెర్సీ, అలా వైకుంఠపురములో, అర్జున్ రెడ్డి వంటి సినిమాలు హిందీలో రిమేక్ అయ్యాయి. అందులో కిక్, రెడీ, అర్జున్ రెడ్డి చిత్రాలు మంచి విజయం సాధించగా ఛత్రపతి, జెర్సీ, అలా వైకుంఠపురములో సినిమాలు మిశ్రమ స్పందనను రాబట్టాయి. మరి ఈ బేబీ సినిమా బాలీవుడ్లో విజయం సాధిస్తుందా లేక నిరుత్సాహా పరుస్తుందో వేచి చూడాలి.