HBD Balakrishna: బాలయ్య పుట్టినరోజున అభిమానులకు గుడ్‌ న్యూస్‌!

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:15 AM

'సింహ’తో గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ(balakrishna), మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌ మొదలైంది.  బాలయ్య (NbK) నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో... ఆ అంశాలతో పాటు బలమైన కథ, పాత్ర, డైలాగ్‌లతో సినిమా తీసి విజయం సాధించారు.

HBD Balakrishna: బాలయ్య పుట్టినరోజున అభిమానులకు గుడ్‌ న్యూస్‌!

'సింహ’తో గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ(balakrishna), మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌ మొదలైంది.  బాలయ్య (NbK) నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో... ఆ అంశాలతో పాటు బలమైన కథ, పాత్ర, డైలాగ్‌లతో సినిమా తీసి విజయం సాధించారు. బాలయ్యను పాత్రకు తగ్గట్టు ఎలా మౌల్డ్‌ చేయాలో కూడా బోయపాటికి బాగా తెలుసు. వాళ్లిద్దరికీ అలా సింక్‌ అయింది. ఆ తర్వాత వారిద్దరి కలయికలో వచ్చిన ‘లెజెండ్‌’, ‘అఖండ’ చిత్రాలు సైతం భారీ విజయం సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్‌ కొట్టారు. ఇప్పుడు డబుల్‌ హ్యాట్రిక్‌కు సిద్ధమవుతున్నారు. దానికి నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా శ్రీకారం చుట్టారు. (NBK110)


boyapati-balayya-109-jpg.webp

జూన్‌ 10... బాలకృష్ణ బర్త్‌ డే  సందర్భంగా  బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన హీరోగా నటించబోయే కొత్త సినిమాను అధికారికంగా వెల్లడించారు. ఈ  చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ (14 Reels plus)సంస్థ నిర్మిస్తోంది. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ‘లెజెండ్‌’ చిత్ర నిర్మాణంలోనూ భాగస్వాములుగా ఉన్న నిర్మాతలు ఇప్పుడు ఈ చిత్రాన్ని రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు. బాలయ్యకు ఇది 110వ చిత్రం. శ్రీను బోయపాటి దర్శకత్వంలో నాలుగో సినిమా ఇది. ఆగస్టు తర్వాత ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం. అయితే ఈ చిత్రంలో బోయపాటి బాలయ్యను ఎలా చూపిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ బర్త్‌ డే సందర్భంగా బోయపాటి శ్రీను సినిమా ప్రకటనతోపాటు అభిమానులకు మరొక సర్‌ప్రైజ్‌ కూడా రానుంది. బాబీ కొల్లి (కెఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా వీడియో గ్లింప్స్‌ కూడా ఈ రోజు రానుందని తెలిసింది. 

హిందూపురం నియోజకవర్గ ప్రజలు,సన్నిహితుల సమక్షంలో బాలయ్య  పుట్టిన రోజు వేడుకను నిర్వహించుకున్నారు. క్క్కడి దేవాలయంలో ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు.

Updated Date - Jun 10 , 2024 | 11:46 AM