Balakrishna: నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దని చెబుతుంటా..
ABN , Publish Date - May 29 , 2024 | 12:40 AM
విష్వక్ సేన్ (Vishwak sen) హీరోగా దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) అంజలి (Anjali) , నేహాశెట్టి (neha shetty)కథానాయికలు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విష్వక్ సేన్ (Vishwak sen) హీరోగా దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) అంజలి (Anjali) , నేహాశెట్టి (neha shetty)కథానాయికలు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఒక తల్లికి పుట్టకపోయినా నన్ను, విష్వక్‌ని కవలలే అంటుంటారు. అతడికంటే నేను చిన్నోడిని అంటూ నవ్వులు పూయించారు. విష్వక్ నా అన్నయ్య. సినిమాపై అమితాసక్తి ఉన్నవాడు. తొలి సినిమా నుంచి నటనలో వైవిధ్యం చూపిస్తున్నాడు. తను కూడా నాలాగే సినిమా సినిమాకి, పాత్ర పాత్రకి కొత్తదనం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఉడుకు రక్తం, నాలాగే దూకుడుతనం కూడా ఉంది’ అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. ‘‘సంక్రాంతి, ఉగాదిలానే రామారావు గారి జయంతి కూడా తెలుగువారికి పండగే. ఆయన 101వ జయంతి రోజున ఈ సినిమా వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్‌లో ఓ వైబ్రేషన్ ఉంది. సినిమా కిక్ ఇచ్చేలా ఉంది. కృష్ణ చైతన్య గతంలో తెరకెక్కించిన ‘రౌడీ ఫెలో’, 'ఛల్ మోహన్ రంగ’ చిత్రాలను ఆదరించినట్టే ఈ సినిమానీ ఆదరిస్తారని కోరుకుంటున్నా. నేహాశెట్టి.. కత్తి, అంజలి.. ఖతర్నాక్. ‘డీజే టిల్లునే భయపెట్టిన రాధికగా ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది. విష్వక్‌కు తన తల్లిదండ్రులే బ్యాక్‌గ్రౌండ్. తన తండ్రి జాతకాలు, వాస్తు చూస్తుంటారు. మనల్ని కాపాడేది దైవం. మా అబ్బాయి మోక్షజ్ఞ కూడా భవిష్యత్తులో ఇండస్ర్టీలోకి రావాలి. తను మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి. నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దని చెబుతుంటా. త్వరలో విష్వక్‌తో కలిసి సినిమాని ప్రకటించబోతున్నాం’’ అని బాలకృష్ణ అన్నారు.
విష్వక్‌సేన్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా షూటింగ్‌లో నాకు ఓ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన బాలకృష్ణగారు ఫోన్ చేయగానే కంటతడి పెట్టుకున్నా. తెలుగోడి ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ ఫొటోతోనే మా సినిమాని రప్రారంభించాం. ఆయన 101వ జయంతిన ఈవెంట్ నిర్వహించడం ఆనందంగా ఉంది. నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా. ఎంతో రిస్క్ తీసుకుని ఆ చిత్రం చేశాం. ‘నువ్వు ఈ యాటిట్యూడ్‌తో పైకి రావు’ అని నా కెరీర్ ప్రారంభంలో చాలామంది కామెంట్ చేసేవారు. కానీ నేను ఏరోజు నా క్యారెక్టర్ మార్చుకోలేదు’ అని అన్నారు.