Bigboss Season 8: బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం.. బోరున ఏడ్చేసిన మణికంఠ
ABN , Publish Date - Oct 04 , 2024 | 05:42 PM
తాజాగా రిలీజైన బిగ్‌బాస్ ప్రోమో అందరిని ఎమోషన్ కి గురి చేస్తోంది. హౌస్‌లో అందరు రిలాక్స్ అవుతున్న వేళా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కి మరో సర్ప్రైజ్ ఇచ్చాడు.
తాజాగా రిలీజైన బిగ్‌బాస్ ప్రోమో అందరిని ఎమోషన్ కి గురి చేస్తోంది. హౌస్‌లో అందరు రిలాక్స్ అవుతున్న వేళా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కి మరో సర్ప్రైజ్ ఇచ్చాడు. "మీకు ప్రశాంతంగా నిద్రొస్తున్నట్లుంది.. లాలి పాట ఏమైనా పాడమంటారా" అంటూ బిగ్‌బాస్ విసుర్లు విసిరారు. తర్వాత సోఫా పై రిలాక్స్ అవుతున్న యష్మీని వెంటనే కన్ఫెషన్ రూమ్‌కి రమ్మని పిలిచాడు. ఆ తర్వాత ఏర్పడిన నాటకీయ పరిస్థితులు కంటెస్టెంట్ ల ఏడుపుకు కారణమయ్యాయి. ఇంతకీ హౌస్ లోపల ఎం జరిగిందంటే..
Also Read- Bigg Boss 8: బిగ్'బాస్' ట్విస్ట్.. బిగ్'డ్రామా'
అనంతరం బిగ్‌బాస్ యష్మీని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచినా తర్వాత హౌస్‌లో మీకు నచ్చిన హౌస్ మెట్ ఎవరూ అని అడిగారు. దీంతో ఆమె నిఖిల్, పృథ్వీ అని చెప్పడంతో అంతా కంగుతిన్నారు. ప్రేరణ పేరు చెపుతుందేం అనుకుంటే ఇలా అయ్యిందేం అని అందరు షాక్ అవుతున్నారు. అనంతరం ఇక మీ ముందున్న క్లాత్ తీయండి అంటూ బిగ్‌బాస్ యష్మీకి ఆదేశాలిచ్చారు. అది ఓపెన్ చేయగా మణికంఠ వాళ్ల వైఫ్ ఇంటి నుండి పంపిన వంటలతో పాటు నిఖిల్ వాళ్ల అమ్మ చేతి వంటలు కనిపించాయి. ఇది చూడగానే మనియూకంత తన వైఫ్ ప్రియా ఇండియాలో ఉందా అంటూ షాక్ అయ్యాడు. ఇక వీరిద్దరిలో ఒకరికి మాత్రమే తమ ఇంటి వంటలు అందుకునే అవకాశం ఉంటుందని అలాగే వారి ఇంటి నుండి వారికి ఒక మెసేజ్ వచ్చిందని, అది ఎవరికీ చెందాలో అనే నిర్ణయం యష్మీ చేతిలో ఉందంటూ బిగ్‌బాస్ డిసైడ్ చేశాడు. దీంతో మణికంఠ ఎమోషనల్ అవుతూ.. ప్లీజ్ యష్మీ అంటూ తల పట్టుకున్నాడు. దీంతో సందిగ్ధంలో పడ్డ యష్మీ నిఖిల్ అందేలా నిర్ణయం తీసుకుంటుండగా.. మణికంఠ అది నాకు చాలా ముఖ్యమైన మెసేజ్ అని అరిచాడు. దీంతో బిగ్‌బాస్ యష్మీ ని మణికంఠ గురించి ఎం ఆలోచించావా అని ప్రశ్నించాడు. అయిన యష్మీ నిఖిల్ వైపే మొగ్గుచూపింది. దీంతో నిఖిల్ తన తల్లి పంపించిన ఫుడ్ తీసుకొని భావోద్వేగానికి గురయ్యాడు. ఇక మణికంఠ 'ఐ లవ్ యూ ప్రియా' అంటూ గార్డెన్‌లోకి వచ్చి ఎమోషనల్ అయ్యాడు.