Brahmaji: ‘గుట్టు చప్పుడు’ కాకుండా.. ఈ చిత్రం షూటింగ్‌ చేస్తున్నారు

ABN , Publish Date - Apr 28 , 2024 | 09:06 PM

డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్ `ఆయేషా ఖాన్‌ జంటగా రూపొందిన‌ ఎంటర్‌టైనర్‌ ‘గుట్టు చప్పుడు’. ఈ చిత్రం టీజర్‌ను తాజాగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

Brahmaji:  ‘గుట్టు చప్పుడు’ కాకుండా.. ఈ చిత్రం షూటింగ్‌ చేస్తున్నారు
guttu chappudu

డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్ (Sanjay Rrao) ఆయేషాఖాన్‌ జంటగా, హనుమాన్‌ చిత్రంతో పాన్‌ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారధ్యంలో మణీంద్రన్‌ దర్శకత్వంలో డా॥ లివింగ్‌స్టన్ (Livingstun) నిర్మిస్తున్న రొమాంటిక్‌ మాస్‌ యాక్షన్‌ లవ్‌, ఎంటర్‌టైనర్‌ ‘గుట్టు చప్పుడు’(Guttu Chappudu). శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అనంతరం ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ తన చేతుల మీదుగా విడుదల చేశారు.

అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో బ్రహ్మాజీ (Brahmaji) మాట్లాడుతూ.. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉంది. టీజర్‌ను సాయి దుర్గాతేజ్‌ ఆన్‌లైన్‌లోను, నేను ఆఫ్‌లైన్‌లోను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. మంచి నిర్మాత, టెక్నీషియన్స్ కుదిరారు, భారీ బడ్జెట్‌తో తీశారు. దర్శకుడు కూడా తీసిన కంటెంట్‌ను మళ్లీ చెక్‌ చేసుకుంటూ జాగ్రత్తగా ఈ సినిమా చేశారు. ఈ టీజర్‌ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఇందులో ఎందుకో గానీ నాకు మాత్రం క్యారెక్టర్‌ ఇవ్వలేదని నవ్వుతూ అన్నారు.

GMQpxQ0XkAA1tdG.jpeg


నిర్మాత లివింగ్‌స్టన్‌ మాట్లాడుతూ.. డైరెక్టర్‌ మణీంద్రన్‌ కథ చెప్పినప్పుడు ఎగ్జైట్‌గా ఫీలయ్యా. ఆయనతో నాకు 12 సంవత్సరాల అనుబంధం ఉంది. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌తోనే చేయాలని ముందే డిసైడ్‌ అయ్యాము. అందుకే పాన్‌ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సంగీత దర్శకుడు హరి గారితో పాటు ఇతర టెక్నీషియన్స్‌ను కూడా మంచి వారిని ఎంచుకున్నాం. ఇదొక ప్రేమ, యాక్షన్‌, రొమాంటిక్‌తో పాటు మంచి మెసేజ్‌తో కూడిన సినిమా. హీరో సంజయ్‌ రెండు రకాల షేడ్స్‌ను అద్భుతంగా చేశారు. టీజర్‌లో మీరు చూసింది కొద్దిగానే. సినిమాలో ఇంకా మంచి స్టఫ్‌ ఉంది.

క్లైమాక్స్‌ ఫైట్‌ను ముందుగా 15 లక్షలతో అనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం దాదాపు రూ.75 లక్షలతో జహీరాబాద్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో తీశాం. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరికీ థ్యాంక్స్‌. ముఖ్యంగా సాయిధ‌ర‌మ్‌ తేజ్‌ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం అన్నారు.సంగీత దర్శకుడు గౌర హరి మాట్లాడుతూ.. నేను మండుటెండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ప్రయాణం మొదలు పెట్టిన తరుణంలో ఈ సినిమా నాకు చెప్పులు దొరికినట్లు దొరికిన అద్భుత అవకాశం. మణీంద్రన్‌ గారు నన్ను చాలా నమ్మారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయలేదని భావిస్తున్నాను. సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. సంగీతానికి మంచి స్కోప్‌ ఉండేలా దర్శకుడు కథను రాసుకోవడం నాకు బాగా ప్లస్‌ అయ్యింది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు.

GMQpxbKXcAAxaKC.jpeg

దర్శకుడు మణీంద్రన్ (MaNiNdRaN) మాట్లాడుతూ.. ముందుగా నేను చెప్పిన బడ్జెట్ కన్నా ఎక్కువ అవుతున్నా.. నా వర్క్‌ చూసిన నిర్మాత లివింగ్‌స్టన్‌ గారు ఎక్కడా అడ్డు చెప్పకుండా సహకరించిన విధానం హేట్సాఫ్‌. అలాగే హీరో గారు కూడా బాగా సహకరించారు. అందుకే సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చింది. ప్రతి టెక్నీషియన్‌ నేను ఏది ఆశిస్తున్నానో.. అంతకు మించి అవుట్‌పుట్‌ ఇచ్చారు. ఆర్టిస్ట్‌లు కూడా చక్కటి సహకారం అందించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గౌర హరి గారితో నాకు 10 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయన సంగీతం ఈ సినిమాకు హైలైట్‌. డబ్బులు పెట్టి టిక్కెట్‌ కొనుక్కుని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుణ్ణి డబ్బుకు మించిన ఆనందాన్ని ఇచ్చే సినిమా ఇది అని అన్నారు.

హీరో సంజయ్‌రావు మాట్లాడుతూ.. ఇది నాకు 3వ సినిమా. ప్రతి టెక్నీషియన్‌ వారి బెస్ట్‌ అవుట్‌పుట్‌ 100 శాతం ఇచ్చారు. అలాగే ఆర్టిస్ట్‌లు కూడా. సంగీత దర్శకుడు గౌర హరిగారు నన్ను కలిసి వినిపించిన తొలి ట్యూన్‌తోనే ఆయన్నే పెట్టుకోవాల్సిందిగా నేను రికమెండ్‌ చేశాను. దర్శకుడు మణీంద్రన్‌ నాకు మంచి మిత్రుడు కూడా. అలాగే నిర్మాత లివింగ్‌స్టన్‌ గారు కూడా అంతే. వీరిద్దరి వల్లే నా జీవితభాగస్వామిని కలవడం జరిగింది. లింగ్‌స్టన్‌ గారు అనుకున్న దానికన్నా బడ్జెట్‌ను భారీగానే పెంచుకుంటూ వస్తున్నారు. కేవలం సినిమా వస్తున్న క్వాలిటీ విధానం ఆయనకు నచ్చే ఇలా జరిగింది. ఇది నాకు మంచి టర్నింగ్‌పాయింట్‌ ఇచ్చే సినిమా. అన్ని వర్గాలను ఆకట్టుకునే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. టీం అందరికీ సూపర్‌ సక్సెస్‌ ఇచ్చే సినిమా ఇది అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్‌ సభ్యులు ఈ సినిమా ఘన విజయం సాధించి తమకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ప్రసంగించారు.

GMQpxWBXEAAJ1Ec.jpeg

Updated Date - Apr 28 , 2024 | 09:06 PM