C202: అక్టోబర్ 25న.. థియేట‌ర్ల‌లోకి ‘సి 202’

ABN , Publish Date - Oct 07 , 2024 | 07:04 PM

డిఫరెంట్ కాన్సెప్ట్, టైటిల్‌తో ‘సి 202’ (C 202) అనే చిత్రం రాబోతోంది.పూర్తి నైట్ ఎఫెక్ట్స్‌లో చిత్రీకరించిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు తాజాగా ప్రకటించారు.

c202

డిఫరెంట్ కాన్సెప్ట్, టైటిల్‌తో ‘సి 202’ (C 202) అనే చిత్రం రాబోతోంది. ఇప్పుడు ఆడియెన్స్ అంతా కూడా కొత్త కాన్సెప్ట్, కంటెంట్ చిత్రాలనే ఆదరిస్తున్నారు. ఈక్రమంలో పూర్తి నైట్ ఎఫెక్ట్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించారు. మున్నా కాశీ (Munna Kasi) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ హర్రర్ థ్రిల్లర్ చిత్రాన్ని మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ (Mighty Oak Pictures)పై మనోహరి కె ఎ (Manohari KA) నిర్మించ‌గా, మున్నా కాశీ సరసన గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ (Sharon Riya Fernandez ) హీరోయిన్‌గా నటించింది.


తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ట్రైలర్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది.

GZSakYzWsAAvU36.jpeg

టెక్నికల్ బ్రిల్లియెన్స్‌తో రూపొందించిన ఈ ‘సి 202’ (C 202) చిత్రం రిలీజ్ డేట్‌ను మేకర్లు తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్న‌ట్లు నిర్మాతలు అధికారికంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Updated Date - Oct 07 , 2024 | 07:04 PM