Unstoppable బాలయ్య - చిరంజీవి.. ఈసారి మామూలుగా ఉండదట!

ABN , Publish Date - Aug 10 , 2024 | 04:38 PM

'ఆహా' ఓటీటీలో (Aha Ott) స్టీమింగ్‌ అయ్యే టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’తో (unstoppable )తన ఫ్యాన్  బేస్‌ను రెట్టింపు చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ(Balakrishna).

'ఆహా' ఓటీటీలో (Aha Ott) స్టీమింగ్‌ అయ్యే టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’తో (unstoppable )తన ఫ్యాన్  బేస్‌ను రెట్టింపు చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ(Balakrishna). ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్‌’ షోలో పలువురు సెలబ్రిటీలను తనదైన చలాకీతనంతో ఇంటర్వ్యూలు చేసి షోకు విపరీతంగా క్రేజ్‌ పెంచారు బాలయ్య. ఇప్పటికి మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ  షో కొత్త సీజన్‌ కోసం సిద్థమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి.  చిత్ర పరిశ్రమలోని కథానాయకులు, దర్శకులు, ఇతర ప్రముఖులతో సందడి చేసిన ఈ షో ఇప్పుడు మరింత జోష్‌తో సాగనుంది. అక్టోబర్‌ 10న ప్రారంభం కాబోయే తదుపరి సీజన్ కు  ముఖ్య అతిథిగా అగ్ర కథానాయకుడు  మెగాస్టార్  చిరంజీవి హాజరు కానున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌ఛల్‌ చేస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. చిరు (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రకటన రావచ్చని టాక్‌ వినిపిస్తోంది.

 
టాలీవుడ్‌లో చిరంజీవి, బాలకృష్ణలకు ప్రత్యేక స్థానం ఉంది. మాస్‌ హీరోలుగా వాళ్లకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  పనిలేదు. అలాంటి స్టార్‌లో ఒకే వేదికపై కనిపిస్తే ఇరు హీరోల అభిమానులకు అంతకుమించిన  వినోదం, ఆనందం ఏముంటుంది. చిరంజీవితోపాటు మరో హీరో నాగార్జున కూడా ఈసారి పాల్గొంటారని సమాచారం. అంతే కాదు ఈ సీజన్ మరింత రసవత్తరంగా ఉండబోతోందట. చిరంజీవితోపాటు అగ్ర కథానాయకులు చాలామంది ఈ సీజన్లో దర్శనమివ్వబోతున్నారట. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కమల్‌హాసన్  రజనీకాంత్  వంటి స్టార్లు కూడా అతిథులుగా రాబోతున్నారని టాక్‌.

Updated Date - Aug 10 , 2024 | 04:38 PM