Ashika Ranganath: అయన దర్శకత్వంలో హీరోయిన్ గా అదే నా కల

ABN , Publish Date - Jan 28 , 2024 | 10:51 AM

ఉదయాన్నే విచ్చుకున్న ముద్దబంతి పువ్వును చూసినంత తాజాదనం ఆమె ముఖంలో మెరుస్తుంది. అందుకే తను బెంగళూరులోని ఓ కాలేజీలో చదివేప్పుడు ‘ఫ్రెష్‌ ఫేస్‌..’ పోటీలో గెలిచింది. ఆ గుర్తింపుతోనే సినిమాల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ‘నా సామిరంగా’తో సత్తా చాటింది. ఆ తాజా కన్నడ సుందరి ఆషికా రంగనాథ్‌ చెబుతున్న కబుర్లివి...

Ashika Ranganath: అయన దర్శకత్వంలో హీరోయిన్ గా  అదే నా కల

ఉదయాన్నే విచ్చుకున్న ముద్దబంతి పువ్వును చూసినంత తాజాదనం ఆమె ముఖంలో మెరుస్తుంది. అందుకే తను బెంగళూరులోని ఓ కాలేజీలో చదివేప్పుడు ‘ఫ్రెష్‌ ఫేస్‌..’ పోటీలో గెలిచింది. ఆ గుర్తింపుతోనే సినిమాల్లోకి వచ్చేసింది. తెలుగులో ‘అమిగోస్‌’తో అడుగుపెట్టి.. ఇప్పుడు ‘నా సామిరంగా’తో సత్తా చాటింది. ఆ తాజా కన్నడ సుందరి ఆషికా రంగనాథ్‌ చెబుతున్న కబుర్లివి...

‘‘నాది కర్ణాటకలోని తుముకూరు. నాన్న రంగనాథ్‌, అమ్మ సుధా రంగనాథ్‌. బిషప్‌ స్కూల్‌లో చదివా. పైచదువుల కోసం ఊరి నుంచి బెంగళూరుకు వెళ్లాను. జ్యోతినివాస్‌ కాలేజీలో చేరినప్పుడు ‘క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫేస్‌’ పోటీలు జరిగాయి. అందమైన అమ్మాయిలు అందరూ పాల్గొన్నారు.. నేను కూడా. నన్ను రన్నరప్‌ వరించింది. ఆ ఉత్సాహంతో రకరకాల డ్యాన్స్‌లు నేర్చుకున్నా. అందులో ఫ్రీస్టయిల్‌, బెల్లీ, వెస్ట్రన్‌ వంటివి కొన్ని. అందాల పోటీలో నన్ను చూసిన దర్శకుడు మహేష్‌బాబు ‘క్రేజీ బాయ్‌’లో అవకాశం ఇచ్చారు. మా అక్క అనూష కూడా హీరోయిన్‌. మా ఇద్దరికీ ఎవరికి ఎవరితోనూ పోటీ లేదు..’’

Untitled-1.jpg

‘‘‘అమిగోస్‌’ చిత్రం ద్వారా తెలుగులో తొలి అవకాశం వచ్చింది. ఈ సినిమా సెట్స్‌లోకి వచ్చినప్పుడు ‘హాయ్‌.. నేను కళ్యాణ్‌రామ్‌ను’ అంటూ ఆయన .. ‘హలో నా పేరు ఆషికా..’ అంటూ నేను... పరిచయం చేసుకున్నాం. కళ్యాణ్‌రామ్‌ చాలా ప్రశాంతంగా, కూల్‌గా ఉంటారు. ఎంతో కష్టపడి పనిచేస్తారు. తెలుగు డైలాగులను స్పష్టంగా పలకడానికి ఎంతో సహాయపడ్డారు. ‘అమిగోస్‌’లో ఆయన మూడు వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. ముగ్గురు వేర్వేరు నటులు నటించినట్లు చేశారు.. ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నటుడిగా ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను..’’

‘‘నాకు పెద్ద పెద్ద కలలు ఏమీ లేవు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో ప్రముఖ హీరో నాగార్జునతో కలిసి ‘నా సామిరంగ’లో నటించే అవకాశం రావడం అదృష్టం. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన కీరవాణితో కలిసి పనిచేయడం ఇంకా సంతోషం. ‘మగధీర’, బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం అద్భుతం. అంత పెద్ద సంగీత దర్శకుడితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఇక, ఎప్పటికైనా దర్శకుడు రాజమౌళి సినిమాలో నటించాలన్నది నా కల..’’

Ashka.jpg

‘తెలుగు సినిమాలు, పాటలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచీ వాటిని చూస్తూ, వింటూ పెరిగాను. అందుకే తెలుగును వెంటనే అర్థం చేసుకున్నాను. ఈ మధురమైన భాషను నేర్చుకుంటున్నాను. కన్నడ నటిని అయినప్పటికీ నటనలో ఎలాంటి భాషా సమస్య రాలేదు. టాలీవుడ్‌లో పలు అవకాశాలు వచ్చాయి. అది నా అదృష్టం. సినిమాల్లోకి వచ్చాక కొత్త విషయాలను నేర్చుకోవడం మొదలుపెట్టాను..’’

‘నాకు పండగలంటే చాలా ఇష్టం. ఇళ్లంతా శుభ్రపరిచి.. పూలతో అలంకరిస్తారు. ఎవరికి నచ్చిన కొత్త బట్టలను వారు ధరిస్తారు. రుచికరమైన వంటలు వండుతారు. కుటుంబ సభ్యులందరూ సంతోషంతో ఒక చోట కలుస్తారు. కలిసి భోజనం చేస్తారు. రంగురంగుల ఆ దృశ్యాలను, ఆహ్లాదకర ఆ సన్నివేశాలను ఎప్పటికీ మరిచిపోలేను. అందుకే ప్రతీ పండగా నాకిష్టం. మన సంప్రదాయాల్లోని బలమే అందర్నీ కలపడం.. ఆత్మీయతల్ని పంచడం.. అనుబంధాల్ని రెట్టింపు చేయడం..’’

WhatsApp Image 2024-01-28 at 10.33.49 AM.jpeg

ఓట్స్‌ అంటే చాలా ఇష్టం..

రోజుకు ఒక కప్పు ఓట్స్‌ తింటే ఆరోగ్యానికి మంచిది. అందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. రక్తంలో చక్కెరస్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అందుకే ఇన్ని ఆరోగ్యలాభాలున్న ఓట్స్‌తో వండిన పదార్థాలను తింటుంటా.

చర్మ సంరక్షణకు కూడా ఓట్స్‌తో తయారుచేసిన మిశ్రమాలు, పదార్థాలను వాడతాను.

ఓట్స్‌లోని పీచుపదార్థం జీర్ణక్రియల్ని చురుగ్గా ఉంచుతుంది, బరువు తగ్గుతాం.

వీటితో వండిన ఆహారపదార్థాలను తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. ఇదొక ఆరోగ్య ప్రయోజనం.

Updated Date - Jan 28 , 2024 | 11:42 AM