Srini Vaitla: గ్యాప్ కూడా మంచిదే.. చాలా నేర్చుకున్నా

ABN , Publish Date - Oct 05 , 2024 | 08:14 PM

గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'విశ్వం'. శ్రీనువైట్ల దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'విశ్వం'. శ్రీనువైట్ల దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కావ్యథాపర్ కథానాయిక.  అక్టోబర్ 11న  గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

'విశ్వం' ఎలా మొదలైంది?

గోపీచంద్, నేను ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నాం. అందుకే ఆయన్ను దృష్టిలో పెట్టుకుని కథ రెడీ చేసి వినిపించాను. తనకు నచ్చడంతో  షూట్ కు వెళదాం అన్నారు. నా శైలిలోకి రావాలంటే 8 నెలలు పడుతుందని టైం తీసుకున్నా. అంతా బాగా వచ్చాక అభిరుచి గల నిర్మాత దోనేపూడి చక్రపాణి తోపాటు విశ్వప్రసాద్ గారు జాయిన్ అయ్యాక సినిమాకు మరింత బలం చేకూరింది. అందుకే యాక్షన్ హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్, ఎమోషనల్ చేయాలని డెప్త్ లోకి వెళ్ళి ఈ సినిమా చేశాను. పదేళ్ళ నాడు హీరో తెలివితేటలతో ఏదైనా సాధించగలడు  అనే కథలు వచ్చాయి. ఈ సినిమా అలా ఉండదు. బర్నింగ్ ఇష్యూ తీసుకుని దాన్ని ఎంటర్ టైన్ మెంట్ లో ఎలా చెప్పొచ్చో చేశాను. మేకింగ్ వైజ్ గా వినూత్నంగా ఉంటుంది. గోపీ పాత్రలో చాలా షేడ్స్ వుంటాయి. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. గ్లింప్స్ లో అటెన్షన్ కోసం అలా చూపించాం. మా ఇద్దరికీ ఫ్రెష్ సినిమా అవుతుంది. పాప పాత్ర కీలకంగా ఉంటుంది.  రోమ్, మనాలి, గోవాలో యాక్షన్ సీన్స్ చేసాం. రెగ్యులర్ ఫైట్స్ కాదు. సహజంగా ఉంటాయి. ప్రతి యాక్షన్ హీరోయిజం లా వుంటుంది. కథ ప్రకారం ఫైట్స్ వుంటాయి. ఎక్కడ అతికించినట్లు ఉండదు. 

Mada.jpg

చిత్రీకరణ పరంగా  ఎటువంటి  సవాళ్లు ఎదుర్కొన్నారు. 

'విశ్వం'  పెద్ద స్పాన్ వున్న కథ. అందుకే మార్కెట్ పరంగా ఛాలెంజ్ గా తీసుకుని దానికి అనుగుణంగా డిజైన్ చేశాను. అందుకు నిర్మాతల సపోర్ట్ బాగుంది. నేను విశ్వంను ఎలా ఊహించుకున్నానో అలా తీయగలిగాను. ఏదో టైటిల్ పెట్టాలని కాకుండా కథ ప్రకారమే పెట్టా. విశ్వంలో చాలా సీక్రెట్స్ వుంటాయి. అలాగే  ఈ విశ్వంలో కూడా  చాలా విషయాలున్నాయి.

కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారింది.. మీరెలా అప్ డేట్ అయ్యారు?

గ్యాప్ వచ్చినా నేను ఎక్కడున్నా సినిమాలు చూస్తూ వస్తున్న మార్పులు గమనిస్తూ వుంటాను. వీటితోపాటు నా శైలిలో ఎంటర్ టైన్ మెంట్ ఎలా చెప్పాలో ఎక్కువ స్ట్రగుల్ అయ్యాను. ఓటీటీ వల్ల ఆడియన్స్ ఆలోచనలు మారుతున్నాయి. ఏదైనా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే థియేటర్ కు రాగలరు. ఆడియన్స్ కూడా వెంకీ తరహా మిస్ అవుతున్నారని అంటున్నారు. అందుకే కేర్ తీసుకుని ఈ సినిమా చేశాను. ప్రాపర్ గా సెట్ అయిందని హీరో, నిర్మాత ఫీలయ్యారు. అదే ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. నేను గేప్ తీసుకున్నా నా శైలి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే వుంది. ఏదో చోట నా కంటెంట్ వస్తూనే ఉంది. థీమ్ లు రిపీట్ అవుతున్నాయని అంటున్నారు. దాన్ని క్రాక్ చేయాలంటే టైం పడుతుంది. ప్రెష్ థీమ్ తో రావాలని కొంత టైం తీసుకున్నా.

'వెంకీ' సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ లా విశ్వంలో ఉన్నట్టు ఉంది? 

ఇందులో ట్రైన్ ఎపిసోడ్ కథకు అవసరం అని పెట్టాను. ఇలా అనుకున్నప్పుడు వెంకీ తో కంపేర్ చేస్తారనిపించింది. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. విశ్వంలో హిలేరియస్ గా ఉంటుంది. ట్రైన్ లో అండర్ కరెంట్ డేంజర్ కూడా వుంది. 30 నిమిషాల పాటు వెన్నెల కిశోర్, గణేష్, నరేష్, కవిత, చమ్మక్ చంద్ర, షకలక శంకర్ వీరందరితో ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. 

మీ సినిమాల్లో బ్రహ్మానందం, ఎం.ఎం. నారాయణ లాంటి వారితో సెటైరిక్ గా వుండేవి. మరి ఈ సినిమాలో అలా వుంటాయా?

నా శైలి సెటైర్. ఢీ నుంచి మన సినిమా అటువంటి ప్లే స్టార్ట్ అయింది. అందుకే వెంకీ చిత్రం రిలీజ్ కు మంచి అప్లాజ్ వచ్చింది. విశ్వంలో హీరోయిజం, విలన్ పాత్రలు రియలిస్ట్ గా వుంటాయి. వారికి తోడు వెన్నెల కిశోర్, నరేష్, గణేష్, ప్రుధ్వీ వంటి పాత్రలు హైలైట్ గా వుంటాయి. 

aaaaa.jpg

గతంలో దర్శకుడు ఫ్లాప్ ఇచ్చినా మరో బ్లాక్ బస్టర్ కొడతారనే పోకడ వుంది. నేడు అలా లేదు. హిట్ కొడితే అవకాశం. దీన్ని మీరెలా చూస్తారు?

ఎప్పుడైనా ప్లాప్ ఇస్తే, బ్లాక్ బస్టర్ హిట్ కూడా దర్శకులు ఇస్తారు. కాకపోతే అప్పట్లో జనాలు బయట అనుకునేవారు. నేడు సోషల్ మీడియా పెరిగింది. ఇదివరకు ఇది లేదు. అందుకే అప్పట్లో అనుకునే వారు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వేదిక చేసుకున్నారు. ఎవరైనా బెటర్ సినిమా చేయాలని అనుకుంటారు.  

మారుతున్నసాంకేతికతతో మీరు అప్ డేట్ అయ్యారా?

టెక్నికల్ గా నేను ఎప్పుడూ అప్ డేట్ అవుతూనే ఉంటాను. కంటెంట్ చేతిలోకి వచ్చాక కొత్త టెక్నాలజీ ప్రకారం అప్ డేట్ లోనే చేయాలనే కసితో చేస్తాం. అవన్నీ మీరు ఈ సినిమాలో చూస్తారు. ప్రత్యేకంగా ఈ సినిమాలో విజువల్స్ చాలా వండర్ గా వుంటాయి. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీలవుతారు. అంతేకాక కథ ప్రకారం సాగే యాక్షన్ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. అందుకే  రవివర్మ ఫైట్ మాస్టర్ తో చేశాం. అవి వినూత్నంగా ఫ్రేక్షకుడు ఫీలవుతాడు.

పాన్ ఇండియా కోసం తీశారా?

నేను కేవలం తెలుగు ఆడియన్స్ కోసం తీశాను. పాన్ ఇండియా వెళితే మంచిదే. ఈ సినిమాకు అభిరుచి గల నిర్మాతలు  దోనేపూడి చక్రపాణి, విశ్వప్రసాద్ ఉండడం వల్లే సినిమా బాగా వచ్చింది. వారు నేను అడిగిన దానికి పూర్తి సపోర్ట్ ఇచ్చారు. చాలా హ్యాపీ గా ఔట్ పుట్ రావడానికి కారకులు అయ్యారు. సినిమా చూశాక మీకు అదే ఫీలింగ్ కలుగుతుంది.

ఢీ సీక్వెల్ ఎప్పుడు?

శ్రీహరి గారికి రీప్లేస్మెంట్ చేయడం కష్టం.

Updated Date - Oct 05 , 2024 | 08:14 PM