Ramam Raghavam: దిల్ రాజుని కంటతడి పెట్టించిన సినిమా..
ABN , Publish Date - Nov 03 , 2024 | 05:41 PM
తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా మంచి సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘రామం రాఘవం’. నటుడు, కమెడియన్ ధనరాజ్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సముద్రఖని తండ్రిగా, ధనరాజ్ కొడుకుగా ఈ చిత్రంలో నటించారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా షో వేయించుకుని చూసిన దిల్ రాజు కొన్ని సీన్లకు ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది.
తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా మంచి సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘రామం రాఘవం’ (Ramam Raghavam). నటుడు, కమెడియన్ ధనరాజ్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సముద్రఖని తండ్రిగా, ధనరాజ్ కొడుకుగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు వీళ్ళిద్దరే కావడం విశేషం. అక్టోబర్ 2న ఈ సినిమా చర్లపల్లి సెంట్రల్ జైలులో ప్రీమియర్ నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 2500 మంది ఖైదీలు ఈ సినిమాను చూసి భావోద్వేగానికి గురైనట్లుగా చిత్ర బృందం పేర్కొంది. ఇప్పుడీ సినిమాను ప్రత్యేకంగా చూసిన దిల్ రాజు (Producer Dil Raju) కూడా భావోద్వేగానికి లోనైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా చూడాలన్న ఆసక్తి ప్రేక్షకులలో మొదలైంది.
Also Read- Narne Nithin: ఎన్టీఆర్ బావమరిది నిశ్చితార్థం
ధన్ రాజ్ డైరెక్ట్ చేసిన ‘రామం రాఘవం’ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు కోసం ప్రీమియర్ ప్రదర్శించారు. ఆయన ఒక్కడే కూర్చుని ఈ సినిమా మొత్తం చూశారని, రెండు మూడు చోట్ల కంటతడి పెట్టుకున్నట్లుగా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇంత బాగా ఈ సినిమాను తెరకెక్కించిన ధన్‌రాజ్‌పై దిల్ రాజు ప్రశంసలు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు వేణుతో ‘బలగం’ వంటి ఎమోషనల్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దిల్ రాజు.. ఇప్పుడు ధన్‌రాజ్ తెరకెక్కించిన ఈ ‘రామం రాఘవం’ చిత్రాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also Read-Malavika Mohanan: టాలీవుడ్ ఎంట్రీనే ప్రధానం.. ప్రభాసే కాపాడాలి
తమిళం, తెలుగు భాషల్లో తండ్రికొడుకుల ఎమోషనల్ జర్నీగా ‘రామం రాఘవం’ చిత్రాన్ని తెరకెక్కించారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూర్చగా.. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు.