Game Changer: దిల్ రాజు అన్‌ప్రిడిక్టబుల్ ప్లాన్స్.. అమెరికాలో ప్రమోషన్స్
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:52 PM
‘ఆర్‌ఆర్‌ఆర్’ తరవాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ నేపద్యంలోనే నిర్మాత దిల్ రాజు తన ఆన్‌ప్రిడిక్టబుల్ ప్లాన్స్‌తో దూసుకుపోయేందుకు సిద్దమయ్యాడు. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటంటే..
‘ఆర్‌ఆర్‌ఆర్’ తరవాత రామ్ చరణ్ (Ram charan) నుంచి వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). అగ్ర దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న చిత్రమిది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినిమా అప్‌డేట్స్, ప్రమోషన్స్ విషయంలో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఇప్పటి వరకూ కేవలం రెండు పాటలే బయటకు వచ్చాయి. రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతూ ఫైనల్‌గా జనవరి 10న డేట్ ఫిక్స్ చేశారు. ఈ నేపద్యంలోనే నిర్మాత దిల్ రాజు తన ఆన్‌ప్రిడిక్టబుల్ ప్లాన్స్‌తో దూసుకుపోయేందుకు సిద్దమయ్యాడు. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటంటే..
ఇందులో బాగానే మొదటగా ఈ నెల 9న లక్నోలో టీజర్ లాంచ్ చేయనున్నారు. ఇక చెన్నై లోను ప్రెస్ మీట్ నిర్వహించి దిల్ రాజు పెద్ద ప్లాన్సే చేస్తున్నాడు. ఇక జనవరి 1న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఇంతటీ ఆగకుండా 12 మంది టీమ్ తో కలిసి రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు అమెరికాలో ప్రమోషన్స్ చేయనున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని భారీగా నిర్వహించాలని ప్లాన్ చేశారట. అలాగే హైదరాబాద్, చెన్నయ్, ముంబయ్, లక్నో ఇలా రకరకాల చోట్ల ఈవెంట్‌లు ప్లాన్ చేస్తున్నారు గేమ్ ఛేంజర్ టీమ్.
ఇక చెన్నై ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. నవంబర్ 9న గేమ్ చేంజర్ టీజర్‌ను లక్నోలో విడుదల చేయబోతున్నాం. తర్వాత యు.ఎస్‌లో ఓ భారీ ఈవెంట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. తర్వాత చెన్నైలో ఓ ఈవెంట్ చేస్తున్నాం. జనవరి తొలి వారంలో ఏపీ, తెలంగాణల్లో ఈవెంట్స్ నిర్వహిస్తాం. జనవరి 10న సంక్రాంతి స్పెషల్‌గా గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేస్తాం. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాం. యూనివర్సల్‌గా గేమ్ చేంజర్ సినిమా అందరినీ మెప్పిస్తుంది. శంకర్ గారి సినిమాలంటేనే స్పెషల్‌గా ఉంటాయి. సాంగ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా సినిమాలో ఉంటుంది.. అవన్నీ గేమ్ చేంజర్ మూవీలో ఉంటాయి. ట్రిపులార్ తర్వాత రామ్ చరణ్‌గారు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆయన హీరోగా నటిస్తోన్న సినిమా గేమ్ చేంజర్. కియారా అద్వానీ హీరోయిన్. ఎస్.జె.సూర్యగారు కీ రోల్ చేశారు. తమన్ ఫెంటాస్టిక్ సాంగ్స్ అందించారు’’ అన్నారు.