Arjun Jandyala: ప్రేక్షకులు సెపరేట్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు..  

ABN , Publish Date - Nov 16 , 2024 | 07:51 PM

గ్యాప్ కు ప్రత్యేక కారణం ఏమి లేదు. కరోనా కారణంగా సహజంగానే అందరికీ ఓ రెండేళ్ళు గ్యాప్ వచ్చింది. తర్వాత ఈ ప్రాజెక్ట్ తో దాదాపు ఏడాదిన్నరగా ట్రావెల్ అవుతున్నాను. ఇలా చూసుకుంటే గ్యాప్ లేనట్లే అన్నారు. 

మహేష్ బాబు(Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) నటించిన రెండో చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ అందించారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  'గుణ 369' తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. దానికి ప్రత్యేక కారణం ఏమి లేదు. కరోనా కారణంగా సహజంగానే అందరికీ ఓ రెండేళ్ళు గ్యాప్ వచ్చింది. తర్వాత ఈ ప్రాజెక్ట్ తో దాదాపు ఏడాదిన్నరగా ట్రావెల్ అవుతున్నాను. ఇలా చూసుకుంటే గ్యాప్ లేనట్లే అన్నారు. 

‘దేవకి నందన వాసుదేవ’ ట్రైలర్ లో కంసుడు, కృష్ణుడు రిఫరెన్స్ కనిపించింది ? ఆ కథ స్ఫూర్తి ఉందా ?

-ఆ రిఫరెన్స్ ఉంటుంది. మూడో సంతానం వలన మరణం అని ట్రైలర్ లోనే చాలా క్లియర్ గా చెప్పాము. అయితే చెప్పని విశేషాలు చాలా ఉన్నాయి. ట్రైలర్లో కంటే చాలా ఎక్కువ కథ సినిమాలో ఉంది. హనుమాన్ సినిమా రాకముందే ఈ కథని లాక్ చేసుకున్నాం. నేను, నిర్మాత కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాము. అలాగే నిర్మాత గారికి ప్రశాంత్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది. అశోక్ గల్లా గారికి అంతకుముందు ఒక కథ చెప్పాను. అ వర్క్ జరుగుతున్నా సమయంలో ప్రశాంత్ గారు ఈ కథ చెప్పారు. ఇది అశోక్ గారికి నచ్చింది. మా అందరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ప్రశాంత్ గారికి నేను తీసిన గుణ సినిమా ఇష్టం. ఈ కథకు నేనైతే ఓకే అని ఆయన భావించారు. అలా ఈ ప్రాజెక్టుని చేయడం జరిగింది.

ఈ  కథకు అశోక్  క్యారెక్టర్ కి ఎలాంటి లుక్ అయితే బాగుంటుందని దానిపై చాలా వర్క్ చేసాం. ప్రతిదీ ఆ క్యారెక్టర్ నుంచి డిజైన్ చేసుకున్నాం. అశోక్ గారు యాక్షన్ ఎమోషన్ లో ఇరగదీస్తారు. ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశారు. తన పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. మురారిలో ఒక డెస్టినీ ఫీల్ వుంటుంది. ఇందులో అది ఇంకో రకంగా ఉంటుంది. హీరోకి ఒక గండం ఉంది. ఆ గండం నుంచి ఎలా బయటపడతారనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ట్రైలర్ లో కూడా ఎక్కడా లేనివిధంగా భూమిలో సుదర్శన చక్రంతో వాసుదేవుని విగ్రహం అని చెప్పాం. దానికి ఒక కనెక్షన్ ఉంది. అది చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఒక సెపరేట్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారని అది కచ్చితంగా చెప్పగలను. మహేష్ బాబు గారికి ట్రైలర్ చాలా నచ్చింది. ఆయన టీమ్ అందర్నీ అప్రిషియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే సినిమాను కూడా చూడబోతున్నారు. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లంతా కూడా చాలా అద్భుతంగా ఉందని అప్రిషియేట్ చేశారు.  మానస మిస్ ఇండియా 2020. తన పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. 

"ధర్మం అంటే దేవుడు అనే మాట కూడా ఇందులో చాలా కీలకం.  దాని యొక్క సారాంశం కథలో అండర్లైన్ గా వెళుతుంది. అలాగే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. చాలా మంచి విజువల్ ఫీలింగ్ ఉంటుంది. ఈ కథకి అలాంటి టెంపుల్, ఆ లొకేషన్ అయితే యాప్ట్ గా ఉంటుందని అనిపించింది. ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.  సాయి మాధవ్ గారు చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రాణప్రతిష్ట చేశాడు. మ్యూజికల్ గా సినిమా వండర్ఫుల్ గా ఉంటుంది"


 

Updated Date - Nov 16 , 2024 | 07:53 PM