Devaki Nandana Vasudeva: టైటిల్‌లో.. వాసుదేవ ఎందుకు పెట్టామంటే

ABN , Publish Date - Oct 06 , 2024 | 08:14 PM

హీరో వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత‌ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా న‌టించిన‌ కొత్త చిత్రం ’దేవకి నందన వాసుదేవ’ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేక‌ర్స్‌ ప్రకటించారు. అనంత‌రం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు నటీనటులు సమాధానమిచ్చారు.

dnv

రెండేండ్ల క్రితం హీరో వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) కథానాయకుడిగా రూపొందిన కొత్త చిత్రం ’దేవకి నందన వాసుదేవ’(Devaki Nandana Vasudeva). వారణాసి మానస (Manasa Varanasi) కథానాయికగా నటిస్తోంది. దీనికి హను-మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) క‌థ అందించగా అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా తమ్మిరాజు బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేక‌ర్స్‌ ప్రకటించారు. అనంత‌రం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు నటీనటులు ఇలా సమాధానమిచ్చారు.

Devaki Nandana Vasudeva

దర్శకుడు అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) మాట్లాడుతూ.. గ‌తంలో గుణ 369 ఓ సందేశంలో తీశా. ఈ సినిమా సత్ సంకలత్పంతో శక్తి వైబ్రేట్ అయి మనకు ఎలా హెల్ప్ చేస్తుందనే సందేశం ఇందులో చెప్పాం. టైటిల్ లో వాసుదేవ ఎందుకు పెట్టామంటే బ్యాక్ డ్రాప్‌లో కృష్ణుడు కనిపిస్తాడు. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టేలా కథ కుదిరింది. డివైన్ ఫీల్ ఈ సినిమాలో ఉంది. సినిమా ఆరంభంనుంచి ముగింపు వరకు ప్రతి పాత్రా హైలైట్ అయ్యేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాం.

WhatsApp Image 2024-10-06 at 4.32.05 PM.jpeg


హీరోయిన్ మానస (Manasa Varanasi) మాట్లాడుతూ.. ఈ సినిమాలో డాన్స్ కూడా బాగా చేశాను. మిస్ ఇండియా నేపథ్యం కాబట్టి ఆ ఫార్మెట్ నుంచి బయటకు వచ్చి సినిమాలో డాన్స్ చేయడం నాకు ఛేంజ్ గా అనిపించింది. కాలేజీ నుంచి మోడలింగ్ చేశాను. మిస్ ఇండియా నుంచి సినిమా అనే మరో లోకంలోకి వచ్చాను. చిన్నతనం నుంచి క్యూరియాసిటీ వుండేది. సినిమా కోసం పలు వర్క్ షాప్స్ చేశాను. ఈ సినిమా పరంగా అర్జున్ గారే నా గురువు. పాత్రను అద్భుతంగా మలిచారు.

హీరో అశోక్ గల్లా (Ashok Galla) మాట్లాడుతూ, నేనున్న పరిస్థితికి మంచి సినిమాలు చేయాలి. పేరు చెడగొట్టకూడదు కష్టపడి చేయాలి. అది సినిమాలో కనిపిస్తుంది. కథ విన్నప్పుడు బాగా నచ్చేసింది. పెద్ద స్పాన్ ఉన్న కమర్షియల్ సినిమా నాకు రెండో సినిమాగా రావడం చాలా హ్యాపీగా వుంది. డాన్స్ నేర్చుకుని బాగా చేశాను. ఇది విజయనగరం బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. గెటప్స్ కూడా వినూత్నంగా వేయించారు. ఇందులో నాపేరు క్రిష్ణ. అమ్మచెబితే ఏదైనా చేసే కుర్రాడు. దేవుడిపై ఉన్న నమ్మకం కూడా అలాంటిదే. స్వేచ్ఛ కోరుకునే కుర్రాడి కథ. మహేష్ బాబు టీజర్ చూశాక, బాగుందని కితాబిచ్చారు.

Updated Date - Oct 06 , 2024 | 08:14 PM