Karuna Kumar: ‘మట్కా’ వైజాగ్‌లో ఒకప్పుడు జరిగిన కథ.. నైట్ క్ల‌బ్బులు, క్యాబ‌రేలు ఉండేవి

ABN , Publish Date - Nov 11 , 2024 | 09:44 AM

మట్కా వైజాగ్‌లో ఒకప్పుడు జరిగిన కథ. వైజాగ్‌లో నైట్ క్లబ్లు ఉండేవి క్యాబ‌రేలు ఉండేవి. అప్పటి మనుషులు అప్పుడు వాళ్ళు చేసిన గొప్ప గొప్ప ఎచీవ్మెంట్లు అన్నీ చూపించాలనుకుని వాళ్లందరి ఇన్స్పిరేషన్ గా మట్కా చేశాన‌ని ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్ అన్నారు.

matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్ మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా (Matka) ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. భారీగా హాజరైన అభిమానులు సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ.. గుడ్ ఈవెనింగ్ వైజాగ్. నేను వైజాగ్ అల్లుడిని. దొండపర్తి మా అత్తగారి ఊరు. నా గ్రోత్ ని ప్రత్యక్షంగా చూసినవాళ్లు ఈ వేడుకలో ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. నిర్మాతలు నా మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వైజాగ్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొంత పార్ట్ ని ఈ సినిమాగా చూపిద్దాం అనుకున్నాను. ఒక చిన్న మత్స్యకార గ్రామంగా మొదలైన‌ వైజాగ్ ఈరోజు ప్రపంచ పటంలో ఒక పవర్ హౌస్‌గా నిలిచింది. ఇంత దూరం వచ్చిందంటే దీని వెనక చాలామంది మనుషులు ఉన్నారు. వైజాగ్‌లో పుట్టి పెరిగిన వారి జీవితాలు చాలామందికి తెలియదు. ఆ జనరేషన్‌ని మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దామనుకున్నాను. మట్కా వైజాగ్‌లో ఒకప్పుడు జరిగిన కథ. వైజాగ్‌లో నైట్ క్లబ్లు ఉండేవి క్యాబ్రీలు ఉండేవి. అప్పటి మనుషులు అప్పుడు వాళ్ళు చేసిన గొప్ప గొప్ప ఎచీవ్మెంట్లు అన్నీ చూపించాలనుకున్నాను. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. వైజాగ్ లో సామ్రాజ్యాల స్థాపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్లందరి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మట్కా చేయడం జరిగింది.


DSC_1520.JPG

కథ చెప్పిన ఫస్ట్ మీటింగ్ లోనే వరుణ్ గారు ఓకే చేశారు. ఇప్పుడు నవంబర్ 14 కి మీ ముందుకు వస్తుంది. మీరంతా చూసి ఈ సినిమాని ఆశీర్వదించాలి. ఈ సినిమా గ్రోత్ గురించి మాట్లాడుతుంది. మనిషిలోని మంచి చెడు గురించి మాట్లాడుతుంది. నా విజయాన్ని నా విజన్‌కి తెరరూపం ఇచ్చిన మా డిఓపి కిషోర్ కి కృతజ్ఞతలు. అప్పటి వైజాగ్ ని క్రియేట్ చేసిన ఆర్ట్ దైరేల్టార్ కిరణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. ప్రొడక్షన్ టీం కి కృతజ్ఞతలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి నేను మెగా ఫ్యాన్ ని. ఒక మెగా అభిమానిగా నేను ఈరోజు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా ప్రిన్స్ ని డైరెక్ట్ చేయడం నా సక్సెస్ లో ఒక మైస్టోన్ అనుకుంటున్నాను. మెగా ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ వరుణ్ బాబు. ఆయన సెట్స్ లో ఎలా ఉంటారో అనే ఆలోచన ఉండేది. కానీ రెండో రోజే ఆ ఆలోచనలన్నీ పోయాయి.

వరుణ్ తేజ్ గారికి శుభ్రత అంటే ఇష్టం. కానీ అలాంటి వ్యక్తి నేల మీద కూర్చోమంటే కూర్చున్నారు. బురదలో పడుకోమంటే పడుకున్నారు. వర్షంలో తడవమంటే తడిసారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక్కరోజు కూడా కంప్లీట్ చేయకుండా వర్క్ద్ చేశారు. ఈ సినిమాకి ఆయన పెట్టిన ఎఫర్ట్ నా భూతో నా భవిష్యతి. ఇది నా ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాను. వరుణ్ గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే మీరంతా ఆనందపడతారో, ఆయన ఎలాంటి ఫైట్లు డాన్సులు చేయాలనుకుంటున్నారో, అంత అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో సింగిల్ షాట్ లో ఒక సీన్ ఉంటుంది. అది తెలుగు సినిమాలో నిలబడి పోయే సీన్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు హీరో గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఫస్ట్ ప్రైమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ మిమ్మల్ని కట్టి పడేస్తుంది. మీనాక్షి నోరా జాన్ విజయ్ వీళ్ళ అందరి పెర్ఫార్మన్స్ లో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అందరికీ నా కృతజ్ఞతలు. నవంబర్ 14న సినిమాని థియేటర్లో చూడండి. విజయవంతం చేయండి' అన్నారు

Updated Date - Nov 11 , 2024 | 09:55 AM