Film Celebs - Praneeth: ఇంత నీచమా... అతన్ని చూస్తే అసహ్యమేస్తోంది!
ABN , Publish Date - Jul 08 , 2024 | 10:19 PM
సోషల్ మీడియా వేదికగా చిన్న పిల్లలపై కామెంట్స్ చేసేవారు సమాజానికి ప్రమాదమంటూ సినీతారలు గళమెత్తున్నారు. తండ్రీ-కూతుళ్ల బంధంపై సామాజిక మాధ్యమాల వేదికగా డబుల్ మీనింగ్‌తో కొందరు యూట్యుబర్స్ మాట్లాడం హేయమంటూ
సోషల్ మీడియా వేదికగా చిన్న పిల్లలపై కామెంట్స్ చేసేవారు సమాజానికి ప్రమాదమంటూ సినీతారలు గళమెత్తున్నారు. తండ్రీ-కూతుళ్ల బంధంపై సామాజిక మాధ్యమాల వేదికగా డబుల్ మీనింగ్‌తో కొందరు యూట్యుబర్స్ మాట్లాడం హేయమంటూ టాలీవుడ్ హీరోలు సాయి దుర్గ తేజ్ (Sai Durga tej), మంచు మనోజ్ 9manchu manoj) గొంతెత్తిన సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా మరి కొందరు తారలు రంగంలో దిగారు. విశ్వక్సేన, అహితేజ, కార్తికేయ, సుధీర్, నటి ఖుష్బూ (Khushboo)తదితరులు స్పందించారు.
అతను ఇంత నీచమైన జీవి అనుకోలేదు: సుధీర్‌బాబు
‘‘మంచో చెడో నేను సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. అప్పుడప్పుడే మాత్రమే కనిపిస్తాను. ఆ యూట్యూబర్‌ను ‘హరోంహర’లో తీసుకున్నందుకు అసహ్యమేస్తోంది. నేను, అందుకు క్షమాపణలు చెబుతున్నాం. అతడు ఇలాంటి నీచమైన జీవి అనుకోలేదు. నాక్కూడా పెద్దగా తెలియదు. వీళ్ల గురించి సోషల్ మీడియాలో చెప్పడానికి తగినంత ధైర్యం కూడా రావటం లేదు. కానీ, ఈ సమయంలో కచ్చితంగా స్పందించాలి. ఇలాంటి సంకుచిత మనస్తత్వం కలిగిన వాళ్ల గురించి తెలియజేయాలి. వాళ్లు మాట్లాడిన మాటలు ఎప్పటికీ భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకు రావు’’ సుధీర్‌బాబు పోస్ట్ పెట్టారు.
ఇంత నీచమా: ఖుష్బూ
‘‘తండ్రీ-కూతుళ్ల మధ్య ఉండే స్వచ్భమైన బంధం గురించి ఇంత భయంకరంగా, నీచంగా ఆలోచించడం నిజంగా హేయం. ఇంకా జుగుప్సాకరమైన విషయం ఏంటంటే, సిగ్గుశరం లేకుండా సోషల్‌మీడియా వేదికగా అలాంటివి చూడటం. ఇలాంటి ఘటనలను వ్యతిరేకిస్తూ గళం విప్పిన సాయితేజ్, మంచు మనోజ్‌ను అభినందిస్తున్నా. ఈ విషయంలో గళమెత్తిన అందరికీ మద్దతు లభించాలి. ఈ వాటిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మహిళ, శిశు అభివృద్థి శాఖమంత్రి అన్నపూర్ణను కోరుతున్నా’’ అని ఖుష్బూ ట్వీట్ చేశారు.
నోటికి ఏది వస్తే అది మాట్లాడటం స్వేచ్ఛ కాదు: విశ్వక్ సేన్
‘‘ఇలాంటి సున్నితమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చిన సాయితేజ్‌కు కృతజ్ఞతలు. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, ఇతరులపై ప్రభావం చూపించటం కాదని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్న వాళ్లతో కలిసి జీవించడం నిజంగా బాధాకరం. ఈ ఘటనపై స్పందించినందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గారికి ధన్యవాదాలు. భద్రతతో కూడిన సమాజం కోసం శ్రమిద్దాం. అదే సమయంలో మన హోదా కన్నా వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమని చాటి చెబుదాం’’ అని విశ్వక్ సేన్ అన్నారు.