Harish Shankar - Remake: 2 లక్షల 68 వేల నెగటివ్‌ ట్వీట్స్‌.. మామూలు ఎటాక్‌ కాదిది!

ABN , Publish Date - Aug 08 , 2024 | 05:23 PM

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీశ్‌ శంకర్‌ 'మిస్టర్‌ బచ్చన్' తోపాటు 'ఉస్తాద్‌ భగత్ సింగ్' చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.

రవితేజ (Ravi teja) హీరోగా హరీశ్‌ శంకర్‌ (Harish shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ భారీ అంచనాల మధ్య ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీశ్‌ శంకర్‌ 'మిస్టర్‌ బచ్చన్' తోపాటు 'ఉస్తాద్‌ భగత్ సింగ్' చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ‘‘బాలీవుడ్‌ మూవీ ‘రైడ్‌’కు రీమేక్‌గా ‘మిస్టర్‌ బచ్చన్‌’ తెరకెక్కినప్పటికీ ఒరిజినల్‌ కథకు దీనికీ పోలిక ఉండదు. 70 శాతం మార్పులు చేశాం. లవ్‌ స్టోరీ ప్రధానంగా దీన్ని తెరకెక్కించాం. కచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. హీరో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. డైలాగులు, పాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఉంటాయి’’ అని అన్నారు.

అలాగే పవన్  కల్యాణ్‌తో తీస్తున్న 'ఉస్తాద్‌ భగత్  సింగ్‌'గా (ustaad Bhagath singh) గురించి కూడా ఆయన మాట్లాడారు. "ఆ సినిమా ప్రారంభించిన సమయంలో విపరీతంగా ట్రోల్‌ చేశారు. ‘తెరీ’ రీమేక్‌ ఆపేయమని నన్ను ట్రోల్‌ చేస్తూ 2 లక్షల 68వేల నెగెటివ్‌ ట్వీట్స్‌ (negative tweets) వచ్చాయి. ఇదొక రికార్డ్‌. ఏ దర్శకుడి మీద ఈ స్థాయిలో ట్రోలింగ్‌ ఎటాక్‌ జరగలేదు. అయినా నేను సినిమా తీయడం ఆపలేదు. ఆ టీజర్‌ విడుదలయ్యాక నన్ను ట్రోల్‌ చేసిన వాళ్లందరూ సారీ చెప్పారు’’ అని హరీశ శంకర్‌ అన్నారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిసినట్లు ఆయన చెప్పారు. సినిమాలు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారని.. త్వరలోనే దీని మిగిలిన షూటింగ్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. 

Updated Date - Aug 08 , 2024 | 05:24 PM