Harish Shankar: ట్రోలింగ్ కొత్త కాదు... సోషల్ మీడియా జీవితం కాదు!
ABN , Publish Date - Aug 19 , 2024 | 03:00 PM
దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) 'మిస్టర్ బచ్చన్' )Mr Bachchan) సినిమాకు వచ్చిన టాక్‌పై స్పందించారు. సినిమాలో మంచిని పట్టించుకోకుండా, ఒక్క పాయింట్‌ను ఆధారంగా విమర్శించడం కరెక్ట్ కాదన్నారు.
దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) 'మిస్టర్ బచ్చన్' )Mr Bachchan) సినిమాకు వచ్చిన టాక్‌పై స్పందించారు. సినిమాలో మంచిని పట్టించుకోకుండా, ఒక్క పాయింట్‌ను ఆధారంగా విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. అలాంటి వారినీ, ఆ విమర్శలను పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు(Negative trolls) . "సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్తేమీ కాదు. అలానే సోషల్ మీడియా మాత్రమే నా జీవితం కాదు. నేను ఆకాశం లాంటి వాడిని. ఉరుము వచ్చినా..పిడుగు వచ్చినా ఇలానే ఉంటా(గబ్బర్‌సింగ్‌లో డైలాగ్ ). నా వ్యక్తిత్వం అలాంటిది’’ అన్నారు. ‘గతంలో రవితేజ నటించిన కొన్ని సినిమాలకు వచ్చిన స్పందనలు నన్ను నిరాశపరిచాయి. కానీ, ఆ దర్శకుల మీద లేని అటాక్ నాపై జరిగింది. కొందరు ఉద్దేశపూర్వకంగానే నన్ను టార్గెట్ చేసి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు.
ఇందులోని ఒక డ్యాన్స్ మూమెంట్‌ను ప్రధానంగా తీసుకుని విమర్శిస్తున్నారు. కానీ, ఇందులో మంచి డైలాగులు చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోవడం లేదు. ‘కట్నం తీసుకొని కాపురం చేసే మగవాడు వ్యభిచారం చేసినట్లు లెక్క’ అని రాశాను. దాన్ని పక్కన పెట్టేశారు. ఆ డైలాగు అమ్మాయిలకు చాలా నచ్చిందని నాకు ఫోన్ చేసి చెప్పారు. అలాగే హీరో ఓ సందర్భంలో హీరోయిన్‌తో ‘నీకు నా ప్రేమ అర్థమయ్యేవరకు నిన్ను కదిలించను’ అంటాడు. అమ్మాయిలు ఏ విషయంలోనైనా ‘నో’ చెబితే వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ డైలాగు రాశాను. దీని గురించి కూడా ఎవరూ మాట్లాడలేదు. మంచిని పక్కనబెట్టి వాళ్లకు సౌలభ్యంగా ఉన్న వాటిని తీసుకుని విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.