Harish Shankar: నోబెల్‌ ప్రైజ్‌కు అప్లై చేయండి.. మీ పని ఇలాగే కొనసాగించండి

ABN , Publish Date - Jul 11 , 2024 | 02:15 PM

దర్శకుడు హరీశ్ శంకర్‌ సోషల్‌ మీడియా వేదికపై ఎప్పుడూ ఫైర్‌ అవుతూ ఉంటారు. అయితే ఆయన కోపానికి కారణం ఉంటుంది.  ఆయన చిత్రాలు, సినిమా ఇండస్ట్రీపై  ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ట్రోల్‌ చేసినా ఆయన సహనాన్ని కోల్పోతారు.


దర్శకుడు హరీశ్ శంకర్‌ (Harish Shankar) సోషల్‌ మీడియా వేదికపై ఎప్పుడూ ఫైర్‌ అవుతూ ఉంటారు. అయితే ఆయన కోపానికి కారణం ఉంటుంది.  ఆయన చిత్రాలు, సినిమా ఇండస్ట్రీపై  ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ట్రోల్‌ చేసినా ఆయన సహనాన్ని కోల్పోతారు. అయితే సోషల్‌ మీడియాలో సందర్భం ఏదైన సమయస్ఫూర్తితోనే వ్యవహరిస్తారాయన. తాజాగా మరోసారి హరీశ్  శంకర్‌  ఓ నెటిజనకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) చిత్రంలోని ‘సితార్‌ సాంగ్‌’ను (Sitara song) ప్రచారంలో భాగంగా విడుదల చేశారు.  సాహిత్యం బాగుందంటూ పలువురు సినీ ప్రియులు ఎక్స్‌లో పోస్ట్‌లు పెట్టారు. దానిపై శంకర్‌ స్పందించి వారికి థ్యాంక్స్‌ చెప్పారు. మరోవైపు, రవితేజ, భాగ్యశ్రీ మధ్య వయసు తేడాను హైలైట్‌ చేస్తూ.. ‘‘ఫిల్మ్‌మేకర్స్‌ హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఈ పాటలో ఆమె ఫేస్‌ని చూపించే ప్రయత్నం చేయలేదు’’ అని ఒకరు కామెంట్‌ చేశారు.


Sitar.jpg
దానిపై హరీశ్‌ స్పందించారు. ‘‘మీరు కనిపెట్టిన విషయానికి కంగ్రాట్స్‌. మీరు నోబెల్‌ ప్రైజ్‌కు అప్లై చేేస్త బాగుంటుంది. ఇలానే మీ పని కొనసాగించండి. మేం స్వాగతిస్తున్నాం’’ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు అందించిన ఈ పాట యూట్యూబ్‌లో చక్కని వ్యూస్‌ సొంతం చేసుకుంది. రవితేజ-హరీశ్‌ కాంబోలో ఇంతకుముందు ‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంతో హ్యాట్రిక్‌ విజయం అందుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 11 , 2024 | 02:47 PM