Ram Pothineni: నాపై ఇంత ప్రేమ చూపుతున్నందుకు కృతజ్ఞతలు.. రామ్ ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - May 15 , 2024 | 10:58 PM
ఈ రోజు (బుధవారం) రామ్ జన్మదినాన్ని సందర్భంగా అలాగే సెలబ్రిటీలు, అభిమానుల నుంచి బర్త్‌డే శుభాకాంక్షలు వెళ్లు వెత్తుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ రామ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
స్కంద వంటి సూపర్ హిట్ తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేని (Ram pothineni) నటిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’(Double ISMART). గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఐస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలోకి రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు (బుధవారం) రామ్ జన్మదినాన్ని సందర్భంగా డబుల్ ఐస్మార్ట్ సినిమా టీజర్ (Double ISMART Teaser)ను రిలీజ్ చేశారు. అలాగే సెలబ్రిటీలు, అభిమానుల నుంచి బర్త్‌డే శుభాకాంక్షలు వెళ్లు వెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా రామ్ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ రామ్ (Ram pothineni) ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.‘యాక్టింగ్ స్కూల్ నుంచి షార్ట్ ఫిల్మ్‌ల వరకు.. అక్కడినుంచి సినిమాల వరకు.. ఇలా మన జీవితంలో మనం అనుకున్నట్లు జీవించడమే అసలైన విజయం. మనం ప్రేమించే పనిని చేయ గలగాలి. ఎక్కువ శాతం నచ్చినట్లు ఉండాలి. ఏది చేస్తే ఆనందంగా ఉంటామో అది చేయగలగడమే పెద్ద విజయం. ఏది చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో అది చేయడమే జీవితానికి అర్థం. ఏది చేసినా సంతోషంగా ఉండడం ముఖ్యం. ఇన్నేళ్ల నా ప్రయాణంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదిస్తూ.. ఎప్పుడూ నాతో ఉంటున్నందుకు, నాపై ఇంత ప్రేమ చూపుతున్నందుకు కృతజ్ఞతలు’ అని తన మనసులోని మాటలను రాసుకొచ్చారు.