Amaran: సాయి ప‌ల్ల‌వి ‘అమ‌ర‌న్’.. ఫ‌స్ట్ సింగిల్ ‘హే రంగులే’ రిలీజ్‌

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:47 PM

శివకార్తికేయన్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన‌ చిత్రం అమ‌ర‌న్. తాజాగా ఈ మూవీ నుంచి హే రంగులే అంటూ సాగే ఓ మెలోడీ పాట‌ను విడుద‌ల చేశారు.

amaran

శివకార్తికేయన్ (Sivakarthikeyan), సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) జంట‌గా విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan)కు చెందిన RKFI అండ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం అమ‌ర‌న్ (Amaran). నిజ జీవిత ఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఈ దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

GZSG_Rda8AAZbbp.jpeg

ఇటీవ‌ల‌ ఈ మూవీ నుంచి సాయి ప‌ల్ల‌వి పోషించిన ఇందు ముకుంద్‌ ఇంట్రోను ప‌రిచ‌యం చేస్తూ వీడియో రిలీజ్ చేయ‌గా తాజాగా హే రంగులే అంటూ సాగే ఓ మెలోడీ పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాయ‌గా సింగ‌ర్స్ అనురాగ్ క‌లుక‌ర్ణి, ర‌మ్య బెహారా ఆల‌పించారు జీ వీ ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందించారు.

Updated Date - Oct 07 , 2024 | 04:47 PM