Hyper Aadi: డిప్యూటీ సీఎంను ఫాలో అయిన హైపర్ ఆది
ABN , Publish Date - Sep 21 , 2024 | 05:33 PM
ఇప్పుడు ఆయన స్ఫూర్తితో నటుడు హైపర్ ఆది (Hyper Aadi) కూడా గ్రామ పంచాయతీలకు రూ.మూడు లక్షల విరాళం (Three lakhs Donation) ప్రకటించి ఆ చెక్కును పవన్ కల్యాణ్‌కు అందచేశారు.
వరద బాధితుల సహాయార్ధం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (AP Deputy CM Pawan kalyan) భారీ విరాళం అందజేసిన సంగతి తెలిసిందే! వరదల కారణంగా దెబ్బ తిన్న ఏపీలో 400 పంచాయతీలకు ఒక్కోదానికి రూ.లక్ష చొప్పున రూ. 4 కోట్ల సొంత నిధులు విరాళంగా ప్రకటించారు. ఆ నిధులను నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తానని మాటిచ్చారు. ఇప్పుడు ఆయన స్ఫూర్తితో నటుడు హైపర్ ఆది (Hyper Aadi) కూడా గ్రామ పంచాయతీలకు రూ.మూడు లక్షల విరాళం (Three lakhs Donation) ప్రకటించి ఆ చెక్కును పవన్ కల్యాణ్‌కు అందచేశారు. వరద పీడిత (Flood Victims) గ్రామమైన ఎ.కె.మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) పంచాయతీకి రూ లక్ష ఇవ్వాలని, మరో రూ.2 లక్షలు తన స్వగ్రామం పల్లామల్లి గ్రామ పంచాయతీ (ప్రకాశం జిల్లా)కి ఇవ్వాలని ఆయన కోరారు. "వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రూ.6 కోట్లు విరాళం ఇచ్చి పవన్ కల్యాణ్ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు. నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వవచ్చని తెలిసి నా వంతుగా రూ.3 లక్షలు అందిస్తున్నాను’’ అని హైపర్ ఆది అన్నారు.