Hyper Aadi:  రాజకీయం బతికున్నంత కాలం ఆయన్ని గుర్తు పెట్టుకుంటారు!

ABN , Publish Date - Jun 24 , 2024 | 10:37 AM

తాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తాలుకా (Ap Deputy Cm Taluka) అని వ్యాఖ్యానించారు నటుడు హైపర్‌ ఆది Hyper Aadi). ఇదే మాట ఎంతకాలమైనా చెప్పుకుంటానన్నారు.

Hyper Aadi:  రాజకీయం బతికున్నంత కాలం ఆయన్ని గుర్తు పెట్టుకుంటారు!


తాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తాలుకా (Ap Deputy Cm Taluka) అని వ్యాఖ్యానించారు నటుడు హైపర్‌ ఆది Hyper Aadi). ఇదే మాట ఎంతకాలమైనా చెప్పుకుంటానన్నారు. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఏపీలో కూటమి విజయం సాధించిన సందర్భంగా పీపుల్‌ మీడియా ఫ్టాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ నిర్వహించిన విజయోత్సవ వేడుకలో హైపర్‌ ఆది పాల్గొన్నారు.  "కూటమి అనే సినిమా 164 రోజులు ఆడింది. అందుకే ఈ సక్సెస్‌ మీట్‌ నిర్వహించుకుంటున్నాం. ఏ కుమారుడు అయినా తన మొదటి సంపాదనతో తల్లికి చీర కొనిపెట్టినప్పుడు, బైక్‌పై తండ్రిని కూర్చోబెట్టి తీసుకెళ్లినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో.. పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) గెలిచినపుడు ప్రతి జనసైనికుడి కళ్లలో ఆ ఆనందాన్ని చూశాను. లంకా దహనం తర్వాత  హనుమంతుడు వెళ్లి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్లు.. ఎన్నికల్లో విజయం తర్వాత  తన విజయాన్ని అన్నయ్య చిరంజీవి కాళ్ల దగ్గర పెట్టాడు. అంతకంటే భావోద్వేగ సందర్భం మరొకటి ఉండదు’’ అని అన్నారు. 

Aadi.jpg

ఇంకా ఆయన మాట్లాడుతూ
"పలు వేదికల దగ్గర అభిమానులు 'సీఎం సీఎం’ అని అరుస్తుంటే.. మీ వాడిని ఫస్ట్‌ ఎమ్మెల్యే అవ్వమను’ అని కామెంట్‌ చేసేవారు. వాళ్లందరికీ ఇదే నా మాట.. 21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తే.. అన్ని చోట్ల గెలిచాడు. పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాల్లో గెలిచి సత్తా చాటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చున్నాడు. రాజకీయం అనేది బతికున్నంత కాలం పవన్ కల్యాణ్‌ పేరు వినబడుతూనే ఉంటుంది. పదో తరగతి పుస్తకాల్లో చరిత్రను చదువుకున్నట్లు.. దానికి  ఏమాత్రం తీసిపోని చరిత్ర పవనకల్యాణ్‌ది. సాధారణంగా గెలిచిన వాళ్లల్లో గర్వం ఉంటుంది. కానీ పవనకల్యాణ్‌ కళ్లలో భయాన్ని చూశా. ుప్రజలు బలమైన బాధ్యను అప్పగించారు.. 100 శాతం స్ట్రైక్   రేట్‌తో గెలిపించినట్లే 100 శాతం సక్సెస్‌గా తన బాధ్యతను నిర్వర్తించాలనే భయం ఆయన కళ్లల్లో చూశాను. ఆయన అది చేసి చూపిస్తాడు కూడా! అలాంటి నాయకుడు మనకు దొరకడం అదృష్టం’’ అని అన్నారు. 



Updated Date - Jun 24 , 2024 | 10:44 AM