Matka: జానీ మాస్టర్ కొరియోగ్రఫీ.. అదిరిన 'లే లే రాజా' లిరిక‌ల్ వీడియో

ABN , Publish Date - Oct 15 , 2024 | 05:51 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్మోస్ట్ ఎవైటెడ్ మూవీ మట్కా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా.. మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లే లే రాజా విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు.

matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) మోస్ట్ ఎవైటెడ్ మూవీ మట్కా (MATKA) రిలీజ్ కు రెడీ అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో థియేట్రికల్ ట్రైలర్‌, సినిమాల‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

GZRAwNdagAAnyO6.jpeg

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi chowdary), నోరా ఫతేహి (Nora Fatehi) హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి.తాజాగా.. మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లే లే రాజా విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు. జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) మెమరబుల్ రెట్రో పాటను స్కోర్ చేసారు. 70, 80ల స్టైల్‌లోని కంపోజిషన్ థంపింగ్ బీట్‌లతో అద్భుతంగా ఉంది. భాస్కరభట్ల సాహిత్యం రెట్రో అనుభూతిని కలిగిస్తుంది, నీతి మోహన్ వోకల్స్ కట్టిపడేశాయి.

WhatsApp Image 2024-10-14 at 8.29.58 PM.jpeg

ఈ పాటలో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్‌లలో ఆకట్టుకున్నారు. కలర్‌ఫుల్ పబ్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన పాటలో నోరా ఫతేహి రెట్రో లుక్‌లో అలరించింది. ఎక్స్ ట్రార్డినరీ డ్యాన్స్ మూవ్స్ తో సోఫియాగా గ్లామర్‌ క్వీన్‌లా కనిపించి మెస్మరైజ్ చేసింది.

WhatsApp Image 2024-10-14 at 8.29.58 PM (1).jpeg

జైలుకు వెళ్ల‌కుముందు జానీ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ వింటేజ్ వైబ్స్ ని తీసుకొచ్చింది. ఇది మ్యూజికల్ ప్రమోషన్‌లకు పర్ఫెక్ట్ స్టార్ట్, నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కోసం స్టేజ్ ని సెట్ చేసింది. కాగా సినిమా నవంబర్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

WhatsApp Image 2024-10-14 at 8.29.58 PM (3).jpeg

Updated Date - Oct 15 , 2024 | 10:25 AM